Zomato: స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న Zomato CEO.. మూడేళ్లుగా సీక్రెట్ టాస్క్.. అందుకేనా..?
Zomato: కంపెనీ సీఈవో స్థాయిలో ఉంటూ సాధారణ డెలివరీ బాయ్ గా సేవలు అందిస్తున్నారు దీపిందర్ గోయల్. గడచిన మూడు సంవత్సరాలుగా ఆయన దీనిని ఫాలో అవుతున్నారు. విశేషం ఏమిటంటే.. ఇప్పటి వరకు ఆయనను ఎవరూ గుర్తుపట్టకపోవటమే. అసలు ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారు.. అసలు మ్యాటర్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మూడు నెలలకోసారి..
స్టార్టప్ కంపెనీలను స్థాపించి వాటికి సీఈవోగా కొనసాగటం అంటే అంత సులువు కాదు. కస్టమర్ల నుంచి, ఇన్వెస్టర్ల నుంచి, మార్కెట్లోని ఇతర పోటీదారుల నుంచి చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే అసలు మార్కెట్లో కస్టమర్లు ఏమి కోరుకుంటున్నారు, గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకోవటం చాలా కీలకం. అప్పుడే కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలం అని Zomato CEO నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక రోజంతా డెలివరీ బాయ్ గా మారిపోతున్నారని వెలుగులోకి వచ్చింది.

ఇలా వెలుగులోకి..
దీపిందర్ గోయల్ సాధారణ జొమాటో డెలివరీ బాయ్ లాగా ఎర్ర టీషర్డ్ వేసుకుని ఆర్డర్లు డెలివరీ చేస్తుంటారని ఇన్వెస్టర్ సంజీవ్ బిక్‌చందానీ ట్వీట్టర్లో వెల్లడించారు. Naukari.com యజమానిగా ఉన్న చందానీ జొమాటోలో పెట్టుబడులు కూడా పెట్టారు. కంపెనీలోని సీనియర్ మేనేజర్లు సైతం ఇదే ఫాలో అవుతారని అందులో వెల్లడించారు. మోటార్ సైకిల్ పై ఆర్డర్లు డెలివరీ చేస్తున్న వారిని ఇప్పటి వరకు ఎవరూ గుర్తించకపోవటం గురించి ట్వీట్ లో ప్రస్థావించారు.

వినియోగదారుల రియాక్షన్..
కంపెనీ యాజమాన్యంలోని కీలక వ్యక్తులు ఇలా చేయటం గొప్ప చొరవ అని, ఇది స్పూర్తిదాయమైన చర్య అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కంపెనీ తన ఫుడ్ అండ్ మ్యూజిక్ కార్నివాల్ జోమాలాండ్‌ను 2022-23లో ఏడు నగరాలకు తిరిగి తీసుకువస్తున్నట్లు గతవారం ప్రకటించింది. ఈ ఫెస్టివల్‌లో 400 రెస్టారెంట్లు ఉంటాయి. జొమాటో 140 గంటల వినోదాన్ని అందిస్తుందని తెలుస్తోంది.

ఈవెంట్..
ఈ మెగా ఈవెంట్ లో బాద్‌షా, హార్డీ సంధు, డివైన్, రిత్విజ్, తన్మయ్ భట్, కనన్ గిల్, మోర్ దిస్ మాథ్యూస్, రాహుల్ వంటి స్టార్‌లు 2019లో ఇందులో పాల్గొన్నారు. అప్పట్లో 300 కంటే ఎక్కువ రెస్టారెంట్లు ఇందులో పాల్గొన్నాయని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications