Zomato Q1 Results: దేశంలో అతిపెద్ద ఫుడ్ డెలివరీ సంస్థగా ఉన్న జొమాటో అందరినీ తన పనితీరుతో ఆశ్చర్యానికి గురిచేసింది. మార్కెట్లో లిస్ట్ అయిన ఈ స్టార్టప్ కంపెనీ తన ఇన్వెస్టర్లకు రానున్నదంతా మంచి కాలమేనని సూచిస్తోంది.
జూన్ తో ముగిసిన మొదటి త్రైమాసికంలో జొమాటో ఫుడ్ డెలివరీ గ్రాస్ ఆర్డర్ విలువ 11.4 శాతం పెరిగి రూ.7,318 కోట్లకు చేరుకుంది. మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం, స్కేలబిలిటీ గురించి తలెత్తిన ఆందోళసనలు ప్రస్తుతం తొలగిపోయాయి. సగటు నెలవారీ లావాదేవీల వినియోగదారులు మార్చి త్రైమాసికంలో 16.6 మిలియన్ల నుంచి 5.4 శాతం పెరిగి 17.5 మిలియన్లకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.2 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఫుడ్ డెలివరీ డిమాండ్ పెరుగుదల కారణంగా గత ఏడాదితో పోల్చితే ఆదాయం 70.9 శాతం పెరిగి రూ.2,416 కోట్లుగా నమోదైంది. వాస్తవానికి కంపెనీ సెప్టెంబరు నాటికి అంటే రెండో త్రైమాసికంలో లాభాల్లోకి చేరుకుంటుందని భావించినట్లు జొమాటో సీఎఫ్ఓ అక్షంత్ గోయల్ తెలిపారు. అయితే వ్యాపారాల్లోని జట్టులోని కొన్ని క్లిష్టమైన భాగాలు తమ అంచనాలు/ప్రణాళికలను అధిగమించాయన్నారు. కొన్ని కార్యక్రమాలు తాము ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలను అందించాయని వెల్లడించారు.
ఈ వ్యాపారంలో జొమాటో, స్వీగ్గీలు ప్రధాన నగరాల్లోని వినియోగదారులకు దగ్గర కావటంతో.. భారతదేశ ఆహార-డెలివరీ మార్కెట్ కరోనా వైరస్ సంవత్సరాల్లో వృద్ధి చెందదని పరిశ్రమ నిపుణులు హెచ్చరించారు. తరచుగా ఆహారాన్ని ఆర్డర్ చేసే నమ్మకమైన వినియోగదారుల ద్వారా సమీప భవిష్యత్తులో పెరుగుతున్న వృద్ధి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. రానున్న పదేళ్ల కాలంలో జొమాటో కంటే బ్లింకిట్ తమ షేర్ హోల్డర్లకు అధిక విలువను అందిస్తుందని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడించారు.
ఇదే సమయంలో Blinkit గ్రాస్ ఆర్డర్ విలువ Q4FY23లో రూ.2,046 కోట్ల నుంచి Q1FY24లో రూ.2,140 కోట్లకు వరుసగా 5 శాతం వృద్ధిని సాధించింది. రాబోయే కొద్ది నెలల్లో వృద్ధి, లాభదాయకతను అందించడానికి బృందం చాలా కృతనిశ్చయంతో ఉందని బ్లింకిట్ వ్యవస్థాపకుడు & CEO అల్బిందర్ ధిండా అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications