Swiggy Holi Ad: హోలీ సందర్భంగా ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ ప్రత్యేకంగా దిల్లీ-NCR ప్రాంతంలో యాడ్ బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ ప్రకటనపై ఇప్పుడు వివాదం చుట్టుకుంది. దీంతో చాలా మంది యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నారు. దీనికి తోడు స్విగ్గీని బహిష్కరించాలంటూ చాలా మంది పిలుపునిస్తున్నారు.

అసలు ఏం జరిగింది..?
రంగుల పండుగ సందర్భంగా, ప్రజలు తమ హోలీకి అవసరమైన వస్తువులను ఇన్‌స్టామార్ట్‌లో డెలివరీ చేయవచ్చని సూచించే కొత్త ప్రకటనతో స్విగ్గి వచ్చింది. గుడ్లు ఉన్న బిల్‌బోర్డ్ ప్రకటనలో, "ఆమ్లెట్; సన్నీ సైడ్-అప్; కిసీ కే సర్ పర్, #BuraMatKhelo ప్రచురించింది. హోలీ పండుగకు అవసరమైన వస్తువులను ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేసి పొందాలంటూ తన కస్టమర్లకు సూచించింది. ఈ క్రమంలో 'హిందూఫోబిక్ స్విగ్గీ' అనే హ్యాష్‌ట్యాగ్‌తో పలువురు ట్వీట్ చేశారు. ప్రజలు స్విగ్గీని బహిష్కరించాలని వారు కోరారు.

ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్..
హోలీ సందర్భంగా హిందువులకు జ్ఞానాన్ని అందించేందుకు స్విగ్గీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సంస్థ కొంతమంది శాకాహారులకు వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే.. మాంసాహారాన్ని పంపిందని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ తన ట్వీట్‌లో తెలిపారు. ఇదే క్రమంలో శివసేన మాజీ నేత రమేష్ సోలంకి సైతం స్విగ్గీ ప్రకటనను వ్యతిరేకించారు. లక్షలాది మంది ప్రజలు జరుపుకునే హోలీ పండుగకు స్విగ్గీ బిల్‌బోర్డ్ అగౌరవంగా ఉందన్న ఆయన.. ఈ తప్పుకు స్విగ్గీ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

రంగంలోకి దిగిన కంపెనీ..
ఒక యాడ్ ఇంతటి సంచలనంగా మారటంతో స్విగ్గీ నష్ట నివారణ చర్యలను ప్రారంభించిందని తెలుస్తోంది. ప్రజాగ్రహానికి గురైన కంపెనీ హోలీ సందర్భంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను ప్రస్తుతం తొలగించినట్లు తెలుస్తోంది. ఇతర మతాల వారు జరుపుకునే పండుగల సమయంలో చేయకూడని పనుల గురించి కంపెనీ ఎందుకు ఇలాంటి యాడ్ బోర్డులను ఏర్పాటు చేయటం లేదంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ట్వీట్ ద్వారా ప్రశ్నించాడు. మెుత్తానికి హోలీ పరువు తీయడానికి స్విగ్గీ చేసిన ప్రయత్నాన్ని తాము ఒప్పుకునేది లేదని సోషల్ మీడియాలో యూజర్లు అంటున్నారు.


Click it and Unblock the Notifications