Zomato News: దేశంలోని ఫుడ్ డెలివరీ రంగంలో విజయవంతంగా జొమాటో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. కంపెనీ తన పనితీరుతో వడివడిగా లాభాల బాట పడుతోంది.
ఈ క్రమంలోనే కంపెనీ తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని.. తద్వారా లాభాలను గడించాలని చూస్తోంది. ఇప్పటికే కంపెనీ జొమాటోతో పాటు బ్లికింట్ పేరుతో వేగంగా వేల ఉత్పత్తులను డెలివరీ చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఈ దూకుడును పెంచేందుకు తనకు ఉన్న మరో బలాన్ని ముందుకు తీసుకొస్తోంది. అయితే ఈ వార్త మార్కెట్లోని ఇతర ప్లేయర్లకు నిద్రలేకుండా చేస్తోంది.

అవును జొమాటో త్వరలోనే లాజిస్టిక్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. దీనికోసం జొమాటో ఎక్స్‌ట్రీమ్ పేరుతో కొత్త సేవను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వ్యాపారులు చిన్న పార్సిళ్లను పంపించటం లేదా పొందటం వీలవుతుందని కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా ఫుడ్ స్టార్టప్ తన విస్తృత డెలివరీ భాగస్వాముల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని ఆదాయాలను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా కంపెనీ దీనిని పైలట్ ప్రాజెక్ట్ కింద పరీక్షిస్తోంది. వ్యాపారులు 10 కిలోగ్రాముల బరువున్న ఇంట్రా-సిటీ ప్యాకేజీలను మాత్రమే పంపగలరని జొమాటో చెబుతుండగా.. రూ.35 నుంచి డెలివరీ సేవలు అందుబాటులోకి తెస్తోంది.
జొమాటో తాజా చర్యలతో మార్కెట్లోని షాడోఫాక్స్, లోడ్‌షేర్, డన్జో, బ్లో హార్న్ వంటి కంపెనీలకు పోటీగా వైట్-లేబుల్ లాజిస్టిక్స్ సేవను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఎక్స్‌ట్రీమ్ మొత్తం డెలివరీ ప్రక్రియను సులభతరం చేస్తోంది. వ్యాపారులు తమ విలువైన కస్టమర్‌లకు ప్యాకేజీలను పంపడాన్ని సులభతరం చేయనుంది. చిన్న దుకాణం అయినా లేదా పెద్ద రిటైలర్ అయినా ఈ సేవలను వినియోగించుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

ఈ క్రమంలోనే జొమాటో ఇప్పటికే Xtreme కింద 3 లక్షలకు పైగా డెలివరీ భాగస్వాములను కలిగి ఉంది. ఇది ఆహారం డెలివరీ విషయంలో మాదిరిగానే వ్యాపారులు తమ పార్సిల్ డెలివరీని లైవ్ ట్రాక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే కంపెనీ ఈ సేవలను 750-800 నగరాల్లో ప్రారంభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం (FY24) మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్-జూన్ మధ్య Zomato రూ.2 కోట్ల లాభాన్ని నమోదుచేసి ఆశ్చర్యానికి గురిచేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications