Zomatoకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జీఎస్టీ అధికారులు.. ఏకంగా రూ.800 కోట్లు పన్ను, ఫైన్..

GST to Zomato: దేశంలోని ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ జొమాటోకు రోజురోజుకూ కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కంపెనీకి జీఎస్టీ అధికారుల నుంచి భారీ టాక్స్ డిమాండ్ నోటీసులు వచ్చినట్లు కంపెనీ గురువారం వెల్లడించింది. థానేలోని జీఎస్టీ అధికారుల నుంచి సదరు నోటీసులు అందాయని కంపెనీ ప్రకటించింది.

తాము ఏకంగా రూ.803.4 కోట్లకు జీఎస్టీ నోటీసులను అందుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫ్లాట్ ఫారమ్ అక్టోబర్ 29, 2019 నుంచి మార్చి 31, 2022 వరకు వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై తమకు జీఎస్టీ చెల్లించలేదని అందులో పేర్కొనబడింది. వాస్తవానికి కంపెనీ దీనికింద మెుత్తంగా రూ.401.7 కోట్లు పన్ను బకాయి చెల్లించాల్సి ఉందని జీఎస్టీ అధికారులు వెల్లడించారు. అలాగే బకాయికి సరిసమానమైన మెుత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ మెుత్తం పన్ను బకాయి దానిపై విధించిన పెనాల్టీ వాస్తవానికి జొమాటో సెప్టెంబర్ 2024 త్రైమాసికంలో సంపాదించిన లాభానికి నాలుగు రెట్లు అధికమైనదిగా తెలుస్తోంది.

Food delivery Giant Zomato received 803 crores tax and penalty notices from GST Thane Know impact

ఈ విషయంలో తాము అప్పీల్ చేస్తామని కంపెనీ చెబుతోంది. తమవద్ద తగిన మెరిట్స్ ఉన్నాయని, లీగల్ టీం సలహాలమేరకు దీనిపై ఎలా ముందుకెళ్లాలనే విషయం ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు కంపెనీ భారీ జీఎస్టీ ఎగవేత పెనాల్టీలపై స్పందించింది. ఈ వ్యవహారంపై తొలిసారిగా జీఎస్టీ అధికారులు డిసెంబర్ 2023లో నోటీసులు పంపుతూ జొమాటోకు సమస్యను లేవనెత్తారు. జొమాటో పన్ను, పెనాల్టీని ఎందుకు చెల్లించాల్సిన అవసరం లేదో వివరణ ఇవ్వాలని అందులో కోరింది. అయితే ఈ వార్తల నేపథ్యంలో ఉదయం 9.50 గంటల సమయంలో జొమాటో స్టాక్ స్వల్ప నష్టాలతో ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.284.25 వద్ద తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.

డెలివరీ భాగస్వాముల తరపున జొమాటో డెలివరీ ఛార్జీని వసూలు చేస్తుంది కాబట్టి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. అలాగే డెలివరీ భాగస్వాములు తమ సేవలను నేరుగా కస్టమర్లకు అందించారని, కంపెనీకి కాదని అందువల్ల డెలివరీ ఛార్జీలు వసూలు చేసింది భాగస్వామి తరఫున కావటం వల్ల దాని నుంచి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ఇప్పటికే జీఎస్టీ అధికారులకు తన వివరణను అందించింది. కానీ ప్రస్తుతం కంపెనీకి తిరిగి నోటీసులు రావటం చూస్తుంటే ఈ వివరణతో జీఎస్టీ డిపార్ట్మెంట్ సంతృప్తిగా లేదని తెలుస్తోంది. పైగా కొత్తగా పన్ను నోటీసులు రావటం కంపెనీకి సవాళ్లను పెంచుతోంది. అలాగే జొమాటో, స్విగ్గీలు కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘించి కొన్ని రెస్టారెంట్లకు తమ ప్లాట్‌ఫారమ్‌లో అనుకూలంగా వ్యవహరించాయని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+