Swiggy News: దేశీయంగా ఫుడ్ డెలివరీ సేవల్లో నిరంతరం తమ టెక్నాలజీని సేవల్లో పెంచుతూపోతున్న కంపెనీల్లో జొమాటో, స్విగ్గీ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారులు ఆర్డర్ పెట్టే సమయంలో పేమెంట్స్ సమయంలో ఎదుర్కొంటున్న అంతరాయాలను పరిష్కరించేందుకు కొత్త పరిష్కారాలను తీసుకొస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ స్విగ్గీ తాజాగా తన యాప్‌లో యూపీఐ చెల్లింపుల వ్యవస్థను కొత్తగా ప్రవేశపెట్టింది. యాప్‌లో చెల్లింపు అనుభవాన్ని క్రమబద్ధీకరించడానికి రూపొందించిన కొత్త ఫీచర్ అయిన Swiggy UPIని ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) యూపీఐ ప్లగ్-ఇన్ సొల్యూషన్‌ను తీసుకురావటం ద్వారా చెక్అవుట్ ప్రక్రియలో ఘర్షణను తగ్గించడం, కస్టమర్ సంతృప్తిని పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

స్విగ్గీ యూపీఐ వినియోగదారులు స్విగ్గీ యాప్‌లోనే నేరుగా యూపీఐ లావాదేవీలను పూర్తి చేయడానికి అనుమతిస్తుంది. చెల్లింపుల కోసం ఇతర యాప్‌ల మధ్య మారాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. చెల్లింపు చేయడానికి అవసరమైన దశల సంఖ్యను ఇది గణనీయంగా తగ్గించింది. దీని ద్వారా స్విగ్గీ చెల్లింపు దశలను 5 నుంచి ఒకటికి తగ్గించినట్లు కంపెనీ పేర్కొంది. Juspay హైపర్‌యూపీఐ ప్లగిన్ ద్వారా ఆధారితమైన ఈ స్ట్రీమ్‌లైన్డ్ ప్రాసెస్, వేగవంతమైన లావాదేవీలు, తక్కువ చెల్లింపు వైఫల్యాలను వాగ్దానం చేస్తుంది. దీనివల్ల లావాదేవీ పూర్తి కావటానికి అయ్యే సమయాన్ని 15 సెకన్ల నుంచి కేవలం 5 సెకన్లకు తగ్గింది.
కొత్త యూపీఐ చెల్లింపు అనుభవాన్ని తమ కస్టమర్లకు పరిచయటం చేయటంపై స్విగ్గీ రెవెన్యూ అండ్ గ్రోత్ హెడ్ అనురాగ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో యూపీఐ అత్యంత ప్రాధాన్య చెల్లింపు పద్ధతుల్లో ఒకటిగా ఉద్భవించినందున వినియోగదారులకు అసమానమైన సౌకర్యాన్ని అందించడానికి ఈ ఫీచర్ తోడ్పడుతుందని అ్నారు. చెల్లింపు వైఫల్యాలను తగ్గించటంలో తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఇందుకోసం వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలను యాప్ చెల్లింపు పేజీలో లింక్ చేయవచ్చు. తద్వారా భవిష్యత్తులో జరిపే అన్ని లావాదేవీల కోసం వారు UPI పిన్‌ని ఉపయోగించవచ్చు.


Click it and Unblock the Notifications