కరోనా వైరస్ పుణ్యాన వ్యవస్థల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. కొందరు ఉద్యోగాలు పోతే.. సంస్థలు కనుమరుగయి పోయాయి. అయితే అవకాశం ఉన్న వారు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో మెట్రో నగరాలు కాస్త ఖాళీగానే ఉన్నాయి. దీంతో అక్కడ ఫుడ్ డెలివరీ గణనీయంగా తగ్గిపోయింది. ఈ విషయాన్ని స్విగ్గీ, జొమాటో చెబుతున్నాయి. అయితే అదే సమయంలో.. చిన్న నగరాల్లో మాత్రం ఫుడ్ డెలివరీ పెరిగిందని పేర్కొన్నాయి.
వైరస్ వల్ల మెట్రో సిటీస్ నుంచి చాలా మంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో చిన్న నగరాల్లో ఫుడ్ డెలివరీలు రెట్టింపు అయ్యాయి. ఈ విషయాన్ని స్విగ్గీ, జొమాటో ప్రకటించాయి. కోల్‌కతా, కొచ్చి, లక్నో, వైజాగ్, గువాహటి, మైసూరు వంటి నగరాల్లో కరోనా వైరస్ కన్నాముందుకంటే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని స్విగ్గీ వెల్లడించింది. అయితే బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో మాత్రం డెలివరీలు పడిపోతున్నాయని చెబుతున్నాయి.

సిటీల నుంచి ఆర్డర్ల సంఖ్య తక్కువగా ఉందని జొమాటో పేర్కొంది. చిన్న నగరాల్లోనే బిజినెస్ బాగుందని స్పష్టం చేసింది. గతంలో మెట్రో నగరాల్లో యాప్ వాడిన వారిలో చాలా మంది ఇప్పుడు చిన్న సిటీల్లో ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. చిన్న నగరాలకు వెళ్లిపోయిన వారిలో మూడింత ఒక వంతు మంది అక్కడి నుంచే ఆర్డర్లు ఇస్తున్నారని జొమాటో పేర్కొంది. పాట్నా, జంషెడ్‌పూర్, రాంచీ నుంచి ఆర్డర్లు బాగా వస్తున్నాయని తెలియజేసింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications