దేశంలో వస్తువులు, సేవల పై పన్నుల వ్యవస్థ (GST) అమలు చేసి ఎనిమిదేళ్లు అవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 3, 4 తేదీల్లో మీటింగ్ పెట్టబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా పన్ను తగ్గింపు పై జరగనుంది. ఈసారి అజెండా చూస్తే వినియోగదారుల జేబుకి రిలీఫ్ ఇచ్చే నిర్ణయాలు తీసుకునే అవకాశమే ఎక్కువ. అసల జీఎస్టీ మొదలైనప్పటి నుంచి ఎవరికీ అంత సులభం కాలేదు. వస్తువులను ఎన్ని స్లాబ్‌లు, ఎన్ని రకాలుగా విభజించడం వల్ల ప్రజలు, వ్యాపారులు ఇద్దరూ అయోమయంలో పడిపోయారు. కాని ఈ మీటింగ్లో ఆహారం, వస్త్రాలు, సిమెంట్, ఇన్సూరెన్స్ ఇలా మన జీవితానికి నేరుగా సంబంధం ఉన్న వాటిపై పన్ను తగ్గించే ప్రణాళికలు చర్చలోకి రాబోతున్నాయి.

ఇప్పటివరకు ఆహార పదార్థాలు, వస్త్రాలపై వేర్వేరు రేట్లు పెట్టడం వల్ల చాలా గందరగోళం వచ్చింది. ఒక రాష్ట్రంలో ఒక రేటు, వేరే రాష్ట్రంలో వేరే రేటు వసూలు చేస్తున్నారు. దీనివల్ల వ్యాపారులకు, వినియోగదారులకు సమస్య ఎదురుకుంటున్నారు. దానికి ఇప్పుడు అన్ని ఆహార పదార్థాలు, టెక్స్టైల్ వస్తువులను డైరెక్ట్‌గా 5% స్లాబ్‌లోకి మార్చాలని కౌన్సిల్ ఆలోచిస్తోంది. ఇలా చేస్తే వర్గీకరణ గందరగోళానికి పూర్తి బ్రేక్ పడుతుంది.
సిమెంట్:
ఇంటి నిర్మాణంలో సిమెంట్ ఖర్చు అందరినీ బాగా ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడీ సిమెంట్‌పై 28% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈసారి దాన్ని 18%కి తగ్గించే అవకాశం ఉందట. ఇలా అయితే ఇల్లు కట్టేవారికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు కాస్త ఊరటనిస్తుంది. కానీ అసలు సమస్య ఏమిటంటే కంపెనీలు ఈ తగ్గింపుని నిజంగా వినియోగదారులకు పాస్ ఆన్ చేస్తారా అన్నది. గతంలో కార్టెలైజేషన్ అనుమానాలు ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా చూస్తున్నారు.
ఇన్సూరెన్స్:
హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఇప్పుడు జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దీని వల్ల చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోవడమే మానేసారు. అందుకే హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీ పూర్తిగా జీరో చేయాలని అలోచిస్తున్నారు. దీని వల్ల మరింత మంది ఇన్సూరెన్స్ తీసుకుంటారు. దేశంలో ఆరోగ్య బీమా పెనిట్రేషన్ కూడా పెరుగుతుంది.
బ్యూటీ పార్లర్, సెలూన్:
ఇప్పటి యువతలో బ్యూటీ పార్లర్, సెలూన్ వెళ్లడం చాలా కామన్ అయిపోయింది. కానీ ప్రస్తుతం మిడ్ టు హై ఎండ్ సెలూన్ల పై 18% జీఎస్టీ ఉంది. ఇది కస్టమర్లకే బరువవుతోంది. ఇప్పుడు దీన్ని 5%కి తగ్గించే ప్రతిపాదన కౌన్సిల్‌లో ఉంది. ఇది తగ్గితే చాలా మందికి ఈ సర్వీసులు సులభంగా అందుబాటులోకి వస్తాయి.
జీఎస్టీ కౌన్సిల్ ఈసారి కేవలం రేట్లు తగ్గించడం మాత్రమే కాకుండా, మొత్తం పన్ను వ్యవస్థను సింపుల్ చేయాలని కూడా ఆలోచిస్తోంది. ఇప్పటి వరకు నాలుగు, ఐదు స్లాబ్‌లు ఉండటంతో వ్యాపారులకు, వినియోగదారులకు కూడా ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ వస్తుందో అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకని, ఒక వస్తువుపై 12% లేదా 18% పడుతుందా అని గందరగోళం లేకుండ ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు ఇప్పుడు కొత్త ప్లాన్ వేస్తుంది.
ఇలా స్లాబ్‌లను తగ్గిస్తే పన్ను వ్యవస్థ క్లారిటీతో ఉంటుంది. వ్యాపారులు కూడా ఇన్వాయిస్‌లు, బిల్లులు చేసేటప్పుడు పొరపాట్లకు అవకాశం తక్కువ. సాధారణ ప్రజలు కూడా ఒక వస్తువుపై ఎంత పన్ను పడుతుందో సులభంగా అర్థం చేసుకుంటారు. మొత్తానికి, జీఎస్టీని సింపుల్ చేసి అందరికీ ఫ్రెండ్లీగా మార్చడమే ఈ కొత్త ప్లాన్ ముఖ్య ఉద్దేశ్యం.
ఇలా చేస్తే ప్రజలకు, వ్యాపారులకు క్లారిటీ వస్తుంది. కానీ పశ్చిమ బెంగాల్ లాంటి కొన్ని రాష్ట్రాలు సీలింగ్‌ని 40% కంటే ఎక్కువ పెంచాలని సూచిస్తున్నాయి. దీనికి కేంద్ర అధికారులు అంగీకరించడం లేదు. ఎక్కువ చేస్తే తప్పు మెసేజ్ వెళ్తుందని, చట్టపరమైన సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
పన్నులు తగ్గిస్తే ప్రభుత్వానికి కొంత రెవెన్యూ లోటు రావొచ్చు. ఎందుకంటే డైరెక్ట్‌గా వచ్చే ట్యాక్స్ ఆదాయం తక్కువ అవుతుంది. కానీ అదే సమయంలో వస్తువుల ధరలు తగ్గి ప్రజలు ఎక్కువగా కొనడం మొదలెడితే, మొత్తానికి వినియోగం పెరిగి మళ్లీ ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం బ్యాలెన్స్ అవుతుంది. తక్కువ రేటు ఎక్కువ వాడకం అనే ఫార్ములా పని చేస్తే, ప్రభుత్వానికి కూడా ఎక్కువ నష్టం అనిపించదు.
ఉదాహరణకి, సిమెంట్‌పై ట్యాక్స్ 28% నుంచి 18%కి తగ్గిస్తే, ఒక్కో బస్తా ధర తగ్గుతుంది. దాంతో ఇల్లు కట్టేవాళ్లు, బిల్డర్లు ఎక్కువ సిమెంట్ కొనగలుగుతారు. ఇలా కొనుగోలు పెరిగితే తగ్గిన రేటు ఉన్నా గానీ మొత్తం వసూలయ్యే ట్యాక్స్ పెరగవచ్చు. అంటే రేటు తగ్గించినా చివరికి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై పెద్ద మైనస్ పడకపోవచ్చు.
ఆహారం, వస్త్రాలు, ఇన్సూరెన్స్ లాంటి డైలీ ఖర్చులు తగ్గితే, ప్రజల జేబులో కొంత ఎక్స్ట్రా డబ్బు మిగులుతుంది. ఆ డబ్బును వాళ్లు మిగతా వస్తువులు, సర్వీసుల మీద ఖర్చు పెడతారు. ఇలా డిమాండ్ పెరగడం వల్ల మొత్తం మార్కెట్ ఉత్సాహంగా మారి ఆర్థిక వ్యవస్థకే పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications