Zomato Shares: జూలై నెల మెుదటి రోజున ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్టార్టప్ జొమాటో కంపెనీ షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్నాయి. దీనికి అసలు కారణం కంపెనీ 2020 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ అధికారుల నుంచి రూ.9.46 కోట్లకు పన్ను డిమాండ్ నోటీసులు పొందటమే కారణం.
కర్ణాటక వాణిజ్య పన్నుల అసిస్టెంట్ కమిషనర్ తమకు పన్ను డిమాండ్ జారీ చేసినట్లు జొమాటో ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. నోటీసు ప్రకారం జీఎస్టీ బకాయి రూ.5,01,95,462తో పాటు రూ.3,93,58,743 వడ్డీ, జరిమానా రూ.50,19,546 కలిపి మొత్తం రూ.9,45,73,751 జీఎస్‌టీ డిమాండ్‌ను కలిగి ఉంది. దీనిపై కంపెనీ స్పందిస్తూ ఆర్డర్ పై అప్పీలుకు వెళుతున్నట్లు పేర్కొంది. వాస్తవానికి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ అధికంగా అందుకున్నందుకు ఈ నోటీసులు అందించబడ్డాయి.

దీనికి ముందు సైతం కంపెనీ జీఎస్టీ అధికారుల నుంచి ఇలాంటి డిమాండ్ నోటీసులను గతంలో కూడా అందుకుంది. భారతదేశం వెలుపల ఉన్న దాని అనుబంధ సంస్థలకు కంపెనీ అందించిన ఎగుమతి సేవల కోసం GST డిమాండ్ రూ.11.82 కోట్ల కోసం ఏప్రిల్ 20న జొమాటో అందుకోగా.. ఏప్రిల్ 1న అదనపు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినందుకు రూ.23 కోట్లకు సంబంధించిన మరో పన్ను డిమాండ్‌ను అందుకుంది. సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు ఈ విషయాన్ని సమర్థించుకోవడానికి తమకు బలమైన మెరిట్స్ ఉన్నట్లు పేర్కొంది. అయితే నోటీసుల వల్ల కంపెనీపై ఎలాంటి ఆర్థిక ప్రభావాన్ని ఆశించడం లేదని జొమాటో స్పష్టం చేసింది.
ఈ వార్తల నేపథ్యంలో నేడు జొమాటో కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో ఫోకస్ లో కొనసాగుతున్నాయి. NSEలో జొమాటో షేర్ ధర ఉదయం 10.42 గంటల సమయంలో స్వల్పంగా నష్టంతో రూ.199.66 రేటు వద్ద కొనసాగుతున్నాయి. కొత్త ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రూల్స్ ప్రకారం జొమాటో కంపెనీ షేర్లు నిఫ్టీ-50 సూచీలోకి వస్తాయని తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications