Zomato Everyday: జొమాటో అనగానే మనందరికీ గుర్తుకొచ్చేవి హోటళ్లలోని బిర్యానీలు, జెంక్ ఫుడ్స్. ప్రస్తుతం బిజీ లైఫ్ కి అలవాటు పడిపోయిన మనలో చాలా మంది టక్కున ఆర్డర్ పెట్టేందుకు కంపెనీ సేవలను వినియోగించుకుంటున్నాం. అయితే జొమాటో ఇక నుంచి ఇంటి వంటను తన కస్టమర్లకు రుచి చూపించాలని నిర్ణయించుకుంది.

ఇంటి రుచులు..
బయటి ఆహారం ఎంత తిన్నా ఇంటి భోజనం రుచే వేరు అని చాలా మంది భావిస్తుంటారు. పైగా కరోనా తర్వాత చాలా మంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవటంతో ఇంటి ఆహారానికి షిఫ్ట్ అయ్యారు. మారుతున్న కస్టమర్ల అభిరుచులను పసిగట్టిన జొమాటో సైతం తన వ్యాపారాన్ని మార్చుకోవటంలో భాగంగా Zomato Everyday కింద ఇంటి రుచులను భోజన ప్రియులకు అందించనుంది. ఇందులో కేవలం రూ.89కే ఆహారాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది.

జొమాటో ఎవ్రీడే అంటే..
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో బుధవారం తన జొమాటో ఇన్‌స్టంట్ స్థానంలో జొమాటో ఎవ్రీడే పేరుతో కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. నిలిపివేయబడిన Zomato ఇన్‌స్టంట్ కింద గతంలో కంపెనీ ఎంపిక చేసిన ఆహార పదార్థాలకు 10 నిమిషాల్లోపు డెలివరీలను అందించింది. అయితే కొత్తగా ఆవిష్కరించబడిన Zomato ఎవ్రీడే కింద.. హౌస్ చెఫ్స్ వండిన ఇంటి భోజనాన్ని అందిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో..
ఇంటి తరహా ఆహారాన్ని ఇప్పటికే మార్కెట్లో Cookr, FoodCloud, HomeFoodi వంటి స్టార్టప్ సంస్థలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని భోజన ప్రియులకు మాత్రమే అందిస్తున్నాయి. ప్రస్తుతం జొమాటో సైతం ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇంటి తరహా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలకునే వారిని టార్గెట్ చేసుకుని ప్రస్తుతం జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్డర్ ప్రక్రియ..
జొమాటో గుర్తించిన చెఫ్‌లు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. వారు తమ ప్రాంగణంలో వినియోగదారుల కోసం మాత్రమే ఆహారాన్ని సిద్ధం చేస్తారు. మెుదటగా జొమాటో ఎవ్రీడే గురుగ్రామ్‌లోని కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వినియోగదారుల నుంచి అల్పాహారం కోసం ఉదయం 8 నుంచి 11:30 గంటల మధ్య, మధ్యాహ్న భోజనం కోసం 11:30 నుంచి 3:30 గంటల మధ్య మాత్రమే ఆర్డర్‌లను తీసుకుంటుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications