IPO News: ఐపీవోను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు.. తెరవగానే పోటాపోటీ.. గ్రేమార్కెట్లో దూకుడు
Fonebox Retail IPO: ఈ వారం మెుత్తం 6 ఐపీవోలు రిటైల్ ఇష్యూను ప్రారంభిస్తుండగా అందులో ఒకటి మెయిన్ ఐపీవో, మిగిలినవి ఎస్ఎమ్ఈ కేటగిరీకి చెందినవిగా ఉన్నాయి. వీటికి ఇన్వెస్టర్ల నుంచి ఊహించని రీతిలో విశేష స్పందన లభించటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఫోన్‌బాక్స్ రిటైల్ ఐపీవో గురించే. తొలిరోజు నుంచే ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీ ఐపీవోకు గట్టి స్పందన లభించింది. మంచి విషయం ఏమిటంటే రిటైలర్లకు ఇందులో పాల్గొనేందుకు మరో రెండు రోజులు గడువు కూడా అందుబాటులో ఉంది. అలాగే గ్రేమార్కెట్లో ప్రస్తుతం కంపెనీ మంచి పనితీరును కనబరుస్తోంది. ఐపీవో కోసం కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.60-70గా నిర్ణయించింది.

రిటైల్ పెట్టుబడిదారుల కోసం ఒక్కో లాటులో 2000 షేర్లు చొప్పున కనీస మెుత్తం పెట్టుబడి రూ.1,40,000గా నిర్ణయించబడింది. జనవరి 25న ప్రారంభించబడిన ఐపీవో జనవరి 30న ముగినుంది. అలాగే పెట్టుబడిదారులకు జనవరి 31న కంపెనీ షేర్లను కేటాయించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రేమార్కెట్ డేటా ప్రకారం స్టాక్ రూ.120 ప్రీమియం ధరను కలిగి ఉంది. అంటే ఈ లెక్కన లిస్టింగ్ రోజున ఒక్కో షేరు రూ.190 రేటు వద్ద మార్కెట్లోకి అరంగేట్రం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదే జరిగితే పెట్టుబడిదారు మెుదటి రోజే కంపెనీ ఐపీవో నుంచి 171.43 శాతం లాభాన్ని పొందవచ్చని తెలుస్తోంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో రూ.20.37 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా ఐపీవోను ఫ్లోట్ చేస్తోంది. మెుదటి రోజున అంటే జనవరి 25న 14.88 రెట్లు సబ్‌స్క్రిప్షన్ వచ్చింది. ఈ IPO రిటైల్ కేటగిరీలో 59.60 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల విభాగంలో 0.01 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో 4.27 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది.


Click it and Unblock the Notifications