టాయిలెట్ సబ్బులు, టూత్ పేస్ట్‌లు, తినదగిన వస్తువులు, మసాలా దినుసులతో సహా దాదాపు ఇరవై వినియోగదారు ఉత్పత్తులు 2020 లాక్ డౌన్ ఏడాదిలో ఒక దశాబ్దంలో అత్యంత వేగవంతమైన విస్తరణను నమోదు చేసిన తర్వాత 2021లో వృద్ది మందగించింది. ఇది కొనుగోలు సెంటిమెంట్ క్షీణతను ప్రతిబింబిస్తుంది. కంతార్ వరల్డ్ ప్యానెల్ తాజా డేటా ప్రకారం హోమ్, పర్సనల్, ఫుడ్ తదితర 14 విభాగాల్లో 2021లో సగటున 6 శాతం పెరిగింది. అంతకుముందు ఏడాది ఇది 20 శాతం పెరిగింది.
కరోనా సమయంలో పలు ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ఉదాహరణకు తరుచూ చేతులు కడుక్కోవడం వల్ల 2020లో సబ్బుల వృద్ధి 13.5 శాతంగా ఉంది. ఆ తర్వాత ఇది క్షీణించింది. 2021లో 2019కి దగ్గరగా 5.8 శాతం వృద్ధితో నిలిచింది. 2020లో ఫ్లోర్ క్లీనర్స్ దాదాపు 61 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఇప్పుడు ఇది 2021లో నాలుగు శాతం క్షీణించాయి. 2020లో డెయిరీ విభాగం 18.3 శాతం లాభపడగా, తదుపరి సంవత్సరంలో 3.6 శాతం క్షీణించింది.

కరోనా సమయంలో ఇంటికే పరిమితం కావడంతో ఎక్కువగా ఇంట్లో గడిపిన సమయంలో కొత్త కొత్త వంటకాలు ప్రయత్నించిన వారు ఉన్నారు. ఆఫీస్ క్యాంటీన్‌లో తినడానికి బదులు ఇంటి వద్ద తినేందుకు మొగ్గు చూపారు. 2021లో ఇది మందగించింది. ప్రస్తుత సంవత్సరం సాధారణీకరణ జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. హ్యాండ్ శానిటైజర్లు, చ్యవన్‌ప్రాశ్, తేనెతో సహా ఆరు వర్గాల్లో మహమ్మారి ప్రేరిత వృద్ధి కనిపించింది.


Click it and Unblock the Notifications