సామాన్యులకు మరో బిగ్ షాక్.. ఆయిల్ నుంచి బిస్కెట్ల వరకు ధరల బాదుడు..ఎందుకంటే..

దేశంలో రోజువారీ వాడే సబ్బులు, వంటనూనెలు, బిస్కెట్లు, బ్రెడ్ వంటి నిత్యావసర ఉత్పత్తుల ధరలు రాబోయే రోజుల్లో మరింత ప్రియం కానున్నాయి. పెరిగిన ముడిసరుకుల వ్యయం, అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో ప్యాకేజ్డ్ కన్స్యూమర్ గూడ్స్ ధరలను పెంచేందుకు దిగ్గజ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే జూన్ త్రైమాసికంలో సగటున ఇరవై ఐదు శాతం మేర ధరలను సవరించిన కంపెనీలు, ఇప్పుడు తమ లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి సెప్టెంబర్ నెల నుండి ఎంపిక చేసిన ఉత్పత్తులపై మరొక విడత ధరల పెంపునకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో కనిపిస్తున్న అస్థిరత, రుతుపవనాల అనిశ్చితి, ఎల్ నినో ప్రభావం వంటి అంశాలు కంపెనీల ఉత్పత్తి ఖర్చులను భారీగా పెంచేశాయి. ఈ భారాన్ని తట్టుకోవడానికి కొన్ని బ్రాండ్లు నేరుగా ఎమ్మార్పీ ధరలను పెంచుతుండగా.. మరికొన్ని కంపెనీలు ధరను మార్చకుండా ప్యాకెట్లలో ఉండే వస్తువు పరిమాణాన్ని తగ్గించే 'శ్రింక్‌ఫ్లేషన్' వ్యూహాన్ని ఎంచుకుంటున్నాయి.

FMCG Price Hike Price Hike Alert Biscuit Price Hike Soap Price Hike Bread Price Hike Cooking Oil Price FMCG Companies FMCG Price Increase September Price Hike Daily Essentials Price Shrinkflation Consumer Inflation Commodity Prices Input Cost Inflation India FMCG FMCG FMCG

ముఖ్యంగా ప్రముఖ బిస్కెట్ల తయారీ సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ సెప్టెంబర్ నుండి తమ ఉత్పత్తుల ధరలను మరో ఒకటిన్నర నుండి రెండు శాతం వరకు పెంచాలని యోచిస్తోంది. మార్కెట్లో చక్కెర, పామాయిల్, ఇంధన ధరలు బాగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆ సంస్థ ఎండీ, సీఈఓ రక్షిత్ హర్గావే వెల్లడించారు.

Also Read

ఈ పెంపు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో, సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే ఐదు రూపాయలు మరియు పది రూపాయల ప్రజాదరణ పొందిన బిస్కెట్ ప్యాకెట్లపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇక ప్రముఖ హోమ్‌కేర్ ఉత్పత్తుల సంస్థ గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ జూన్ నెలలో ఇప్పటికే ఐదు శాతం మేర ధరలను పెంచగా.. సెప్టెంబర్‌లో రెండవ విడత పెంపునకు మార్గం సుగమం చేసుకుంటోంది. ప్రస్తుతానికి ముడిసరుకుల ధరల స్థితిగతులను సమీక్షిస్తున్న సదరు సంస్థ.. త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.

మరోవైపు దేశీయ హెల్త్‌కేర్, పర్సనల్ కేర్ రంగంలో ప్రముఖ బ్రాండ్ అయిన డాబర్ ఇండియా సైతం తమ వినియోగదారులపై ధరల భారాన్ని మోపే సూచనలు కనిపిస్తున్నాయి. పెరిగిన సరుకుల వ్యయం వల్ల పడుతున్న ఒత్తిడిని అధిగమించడానికి ఎంపిక చేసిన కేటగిరీలలో ధరలను పెంచడం మినహా వేరే మార్గం లేదని ఆ సంస్థ భావిస్తోంది. అలాగే మార్కెట్ దిగ్గజాలైన హిందుస్థాన్ యూనిలివర్ (హెచ్‌యూఎల్), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా సెప్టెంబర్ త్రైమాసికంలో పలు రకాల నిత్యావసర వస్తువుల ధరలను పునఃసమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, మార్కెట్ తీవ్రతను బట్టి సెప్టెంబర్ లోపు ధరల పెంపుపై తగిన నిర్ణయం తీసుకుంటామని హెచ్‌యూఎల్ సీఈఓ, ఎండీ ప్రియా నాయర్ పేర్కొన్నారు. అదేవిధంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఎండీ సునీల్ డి సౌజా మాట్లాడుతూ.. ముడిసరుకుల ధరల పెరుగుదల వల్ల సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి అవసరమైన చోట ధరల సవరణ తప్పదని సూచించారు. ఒకవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు, ప్రముఖ కంపెనీల ఈ తదుపరి నిర్ణయం మరింత ఆర్థిక భారాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+