Pureit: దేశంలోని ఎఫ్ఎంసీజీ రంగంలోని దిగ్గజ సంస్థ హిందుస్థాన్ యూనీలివర్ తాజాగా తన వ్యాపారాన్ని విక్రయించింది. కంపెనీ తన వాటర్ ప్యూరిఫయర్ల వ్యాపారాన్ని తాజాగా విక్రయించింది.
హిందుస్థాన్ యూనీలివర్ సంస్థ Pureit పేరుతో భారతదేశంలో నిర్వహిస్తున్న వాటర్ ప్యూరిఫయర్ల వ్యాపారాన్ని 72 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు రూ.601 కోట్లకు విక్రయించింది. ఈ వ్యాపారాన్ని ఏఓ స్మిత్ ఇండియాకు అమ్మేసింది. అయితే ఈ డీల్ పూ్ర్తి కావటానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని కంపెనీ వెల్లడించింది. తాము కోర్ వ్యాపారాలపై దృష్టి పెట్టినందున దేశంలో లక్షలాధిమందికి శుద్ధమైన నీటిని అందించే వ్యాపారాన్ని విక్రయించాలని నిర్ణయించినట్లు సీఈవో, ఎండీ రోహిత్ జావా పేర్కొన్నారు.

గతంలోనే హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీ తన వాటర్ ప్యూరిఫికేషన్ వ్యాపార విక్రయానికి సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత డీల్ దీనిని నిజమని తేల్చింది. ప్యూరిట్ దేశంలో భౌగోళిక ఉనికిని కలిగిఉన్న బలమైన బ్రాండ్‌గా పేరుగాంచిందని ఏఓ స్మిత్ ఇండియా ప్రెసిడెంట్ పరాగ్ కులకర్ణి పేర్కొన్నారు. వినియోగదారుల అవసరాలపై ప్యూరిట్ లోతైన అవగాహన కలిగి ఉందని, వారి వాటర్ ప్యూరిఫికేషన్ నైపుణ్యం దేశంలోని తమ కంపెనీకి అద్భుతమైన బలాన్ని అందిస్తుందని కులకర్ణి అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత డీల్ స్లంప్ సేల్ బేల్ మీద జరిగిందని కంపెనీ వెల్లడించింది.
వాస్తవానికి హిందుస్థాన్ యూనీలివర్ మెుదటిసారిగా 2004న చెన్నైలో ప్యూరిట్ వ్యాపారాన్ని లాంచ్ చేసింది. కంపెనీ వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా 2008లో విస్తరించింది. కంపెనీ 2011లో ఎలక్ట్రిక్ వాటర్ ప్యూరిఫికేషన్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్యూరిట్ వ్యాపారం రూ.293 కోట్లుగా నమోదైంది. ఇది మెుత్తం కంపెనీ వ్యాపారంలో 1 శాతం కంటే తక్కువని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications