Maggi Case: దేశంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మ్యాగీ నూడిల్స్ పరిచయం అవసరం లేని స్నాక్స్. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు రాగానే రెండు నిమిషాల్లో తల్లులు వండే వంటకంగా ఇది ప్రసిద్ధి పొందిన సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీకి పెద్ద విజయం లభించింది.
9 ఏళ్ల కిందట మ్యాగీ నూడుల్స్‌లో సీసం వంటి ప్రమాదకర రసాయనాలను వాడినట్లు ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. 2015లో ప్రభుత్వం దాఖలు చేసిన ఫిర్యాదును జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(NSDRC) తాజాగా తోసిపుచ్చింది. దీంతో నెస్లేకు 9 ఏళ్ల తర్వాత ఈ కేసులో పెద్ద ఊరట లభించింది. వాస్తవానికి వినియోగదారుల వ్యవహారాల విభాగం నెస్లే ఇండియా లిమిటెడ్‌పై ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ కేసులో కంపెనీ నుంచి రూ.639 కోట్లకు పైగా పరిహారం డిమాండ్ కోరారు.

నెస్లే ఇండియాపై దాఖలైన పిటిషన్‌ను NSDRC కొట్టివేయడం FMCG కంపెనీకి పెద్ద ఉపశమనం లభించింది. ఈ విషయాన్ని కంపెనీ తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 2న ఎన్‌సిడిఆర్‌సి ఆమోదించగా కంపెనీకి తీర్పు కాపీ బుధవారం అందింది. వాస్తవానికి 2015లో కంపెనీ ప్రమాదకరమైన-కలుషిత పదార్థాలతో కూడిన మ్యాగీ నూడుల్స్‌ను తయారు చేసి ప్రజలకు విక్రయించిందంటూ కేంద్ర ప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాల విభాగం NCDRCకి ఫిర్యాదు చేసింది.
ఈ కేసులో భారత ప్రభుత్వం నెస్లే నుంచి రూ.284.55 కోట్ల నష్టపరిహారంతో పాటు రూ.355.41 కోట్ల శిక్షా నష్టాన్ని కోరింది. అయితే దీనిపై నెస్లే 9 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఉపశమనం లభించింది. అలాగే 2015లో నెస్లే మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులు ప్రమాదకర రసాయనాలను వాడుతున్నారనే ఆరోపణలతో 6 నెలల పాటు మార్కెట్లో విక్రయించకుండా నిషేధించబడ్డాయి. దీంతో కంపెనీ దాదాపు 38,000 టన్నుల నూడుల్స్‌ను మార్కెట్ నుంచి రీకాల్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మార్కెట్‌లో మ్యాగీ నూడుల్స్ పూర్తిగా కనుమరుగయ్యాయి. తర్వాత నవంబర్ 2015లో ఆంక్షలు సడలించటంతో మ్యాజీ నూడిల్స్ మార్కెట్లోకి తిరిగి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి.
వాస్తవానికి ఈ వార్తతో కంపెనీ షేర్లు లాభపడ్డాయి. శుక్రవారం ఉదయం ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు దాదాపు రూ.19 పెరిగి రూ.2,568 వద్ద ట్రేడవుతున్నాయి. డిసెంబర్ 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.655.61 కోట్లుగా నమోదైంది.


Click it and Unblock the Notifications