Dove Shampoo: ప్రస్తుతం రోజువారీ జీవితంలో మనం వాడే చాలా వస్తువులు హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీకి చెందినవే. ఇది మనందరికీ ఎంతో పరిచయం ఉన్న ఎఫ్ఎమ్సీజీ బ్రాండ్. అయితే బ్రిటన్ కు చెందిన ఈ కంపెనీ మాతృ సంస్థ యూనిలీవర్ ఇప్పుడు కష్టాల్లో పడింది.

కేన్సర్ కారక కెమికల్స్..
చాలా మంది భారతీయులు డవ్, ట్రెసెమీ వంటి షాంపూలను రోజువారీ జీవితంలో వాడుతుంటాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక వార్త పెను సంచలనంగా మారింది. యూనీలివర్ కంపెనీ తయారు చేస్తున్నా షాంపూ బ్రాండ్లలో ప్రమాదకర క్యాన్సర్ కలిగించే బెంజీన్ అనే రసాయనం ఉన్నట్లు వాలిసూర్ ల్యాబ్, ఫుడ్ అండ్ డగ్ర్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది.

షాంపూల రీకాల్..
తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ Dove, Nexxus, Suave, TIGI, TRESemmé Airsol డ్రై షాంపూలను అమెరికా మార్కెట్ నుంచి రీకాల్ చేసింది. అక్టోబర్ 2021కి ముందు తయారు చేయబడిన ఉత్పత్తులను కంపెనీ రీకాల్ చేస్తోంది. స్ప్రై ఆన్ డ్రై షాంపూలలో ఇలాంటి ప్రమాదకరమైన సమస్యను ఎదుర్కొనడం ఇదే మెుదటి సారి కాదు. డిసెంబర్‌లో కంపెనీ ప్యాంటీన్, హెర్బర్ ఎసెన్స్ డ్రై షాంపూలను కూడా రీకాల్ చేసింది. బెంజీన్ శరీంలోకి వెళ్లటం వల్ల లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

భారత దేశంలో..
కంపెనీకి చెందిన డవ్, ట్రెసెమీ షాంపూలు భారత్ లో విస్తృతంగా విక్రయించబడుతున్నాయి. వీటిలో డవ్ డ్రై షాంపూ వాల్యూమ్, ఫుల్‌నెస్, డవ్ డ్రై షాంపూ ఫ్రెష్ కోకోనట్, నెక్సస్ డ్రై షాంపూ రిఫ్రెషింగ్ మిస్ట్, సువేవ్ ప్రొఫెషనల్స్ డ్రై షాంపూ రిఫ్రెష్ అండ్ రివైవ్ కూడా ఉన్నాయి.ఈ వార్త వెలుగులోకి రావటంతో పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లో ఏరోసోల్స్ ఉనికి గురించి మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

డబ్బు తిరిగి పొందటం ఇలా..
ప్రజలు తమ డబ్బును తిరిగి పొందడానికి ఇటువంటి ఉత్పత్తులను ఉపయోగించడం మానేసి UnileverRecall.comలో క్లెయిమ్‌ను ఫైల్ చేయాలని FDA తెలిపింది. ఈ వివాదంపై యూనీలివర్ సంస్థ ఇప్పటి వరకు స్పందించలేదు. గతంలో జాన్సన్ & జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కో, కాపర్‌టోన్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. గత ఏడాది P&G కూడా 30 కంటే ఎక్కువ ఏరోసోల్ స్ప్రే హెయిర్‌కేర్ ఉత్పత్తులను రీకాల్ చేసింది. వీటిలో డ్రై షాంపూ, డ్రై కండీషనర్ కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications