Uniliver Layoffs: దేశంలో పనిచేస్తున్న సంస్థలు ఒక్కొక్కటిగా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో యూనీలివర్ కంపెనీ కూడా చేరిపోయింది.
దేశంలోని ఎఫ్ఎమ్‌సీజీ వ్యాపారంలో ప్రాచుర్యం పొందిన అమెరికా కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్. దీని మాతృ సంస్థ యూనిలీవర్ తాజాగా దేశంలో తన ఐస్ క్రీం యూనిట్‌ను ఒక స్వతంత్ర వ్యాపారంగా మార్చాలని చూస్తోంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రానున్న కాలంలో దాదాపు 7,500 ఉద్యోగాల కోతలకు ప్రభావితం కావొచ్చని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అయితే ఈ చర్య వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని కంపెనీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

హిందుస్థాన్ యూనీలివర్ మాతృ సంస్థ కొత్త ప్రణాళిక ప్రకారం.. మాగ్నమ్ ఐస్ క్రీం తయారీదారు రాబోయే మూడేళ్లలో సుమారు 869 మిలియన్ డాలర్లను ఆదా చేయాలని చూస్తోందని సమాచారం. ఇందుకోసం చేపట్టనున్న మార్పులు చేర్పుల వల్ల దాదాపు 7,500 ఉద్యోగాలపై ప్రభావం ఉండనుంది. వీరిలో ఎక్కువగా కార్యాలయ ఆధారిత పాత్రల్లో, కంపెనీ టర్నోవర్‌లో దాదాపు 1.2% ప్రభావితం కావచ్చని అంచనా. దీనికి ముందు అక్టోబరు 2023లో సీఈవో హెయిన్ షూమేకర్ ఇటీవలి సంవత్సరాల్లో సంస్థ ఆశించిన స్థాయిలో పని చేయలేదని అంగీకరించారు. ఈ క్రమంలో కంపెనీ విక్రయాల్లో 70 శాతం వాటా కలిగి ఉన్న 30 ప్రధాన బ్రాండ్‌లపై దృష్టి సారిస్తానని వాగ్దానం చేశారు.
ఈ క్రమంలో 1.27 లక్షల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించడం నుంచి వెనక్కి తగ్గబోనని ఫిబ్రవరిలో షూమేకర్ స్పష్టం చేశారు. నేడు తాము ప్రకటిస్తున్న మార్పులు ఆ ప్రణాళికను వేగవంతం చేయడంలో సహాయపడతాయని షూమేకర్ మార్చి 19న పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో తాము ఉద్యోగుల ప్రతినిధులతో సంప్రదింపులకు కట్టుబడి ఉన్నామని, ప్రభావితమైన ఉద్యోగులను గౌరవిస్తూ శ్రద్ధ వహిస్తామని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications