Procter and Gamble: వరుసగా కంపెనీలు తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రచురిస్తున్న వేళ చాలా మంది డివిడెండ్ ఆదాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఒక్కో షేరుపై భారీగా డివిడెండ్ ప్రకటించింది.
పర్సనల్ కేర్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్న ప్రోక్టర్ & గ్యాంబుల్ హైజీన్ & హెల్త్ కేర్ అనే కంపెనీ ఇన్వెస్టర్లకు తీపి కబురు చెప్పింది. ఈ MNC ఒక్కో షేరుపై రూ.160 చొప్పున మధ్యంతర డివిడెండ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. వాస్తవానికి మే 2017 తర్వాత కంపెనీ ప్రకటించిన అత్యధిక డివిడెండ్ ఇదే కావటంతో ఇన్వెస్టర్లు సంతోషంలో మునిగి తేలుతున్నారు. అలాగే ప్రోక్టర్ & గాంబుల్ హైజీన్ మే 2017లో గరిష్ఠంగా రూ.362 డివిడెండ్ అందించింది.

మధ్యంతర డివిడెండ్‌లో ఒక్కో షేరుపై 60 రూపాయల వన్-టైమ్ స్పెషల్ డివిడెండ్ కూడా ఉంటుంది. 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ఈ ప్రత్యేక డివిడెండ్‌ను అందజేస్తోంది. డివిడెండ్ ఆదాయాన్ని పొందేందుకు కంపెనీ ఫిబ్రవరి 9, 2024ను రికార్డు తేదీగా నిర్ణయించింది. అలాగే అర్హులైన పెట్టుబడిదారుల ఖాతాల్లోకి డివిడెండ్ సొమ్మును ఫిబ్రవరి 29న చెల్లించాలని నిర్ణయించింది.
డిసెంబర్ 2023 త్రైమాసికంలో ప్రొక్టర్ & గాంబుల్ హైజీన్ రూ.228.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అయితే గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.207.4 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. డిసెంబరుతో ముగిసిన కాలంలో కంపెనీ ఆదాయం మెుత్తంగా రూ.1,133 కోట్లుగా ఉంది. ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే స్వల్పంగా తగ్గటం గమనార్హం. కంపెనీ దేశంలో ఎఫ్ఎంసీజీ రంగంలో టైడ్, ఏరియల్, విక్స్, జిల్లెట్ సహా మరిన్ని బ్రాండ్స్ కింద అనేక ఉత్పత్తులను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications