Dividend Stock: ఒక్కో షేరుకు రూ.200 డివిడెండ్.. నేడే చివరి అవకాశం..
P&G Stock: దేశీయంగా కార్పొరేట్ కంపెనీలు తమ క్యూ3 ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిపోర్టులను ఫిబ్రవరిలో వరుసగా ప్రకటించాయి. ఈ క్రమంలో అనేకే కంపెనీలు తమ పెట్టుబడిదారులకు కళ్లు చెదిరే డివిడెండ్ ఆఫర్ చేస్తున్నాయి.
తాజాగా ఇలాంటి డివిడెండ్ అందించే కంపెనీలపై చాలా మంది బెట్టింగ్ వేస్తూ స్వల్ప కాలంలోనే మంచి రాబడులను పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వీరి కన్ను ఎఫ్ఎమ్సీజీ రంగంలోని Procter & Gamble Health Ltd కంపెనీ షేర్లపై పడింది. ఇటీవల కంపెనీ అర్హులైన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.200 డివిడెండ్ చెల్లించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సొమ్మును పొందేందుకు ఇన్వెస్టర్లకు నేడే చివరి అవకాశం. ఎందుకంటే నేటితో కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో ఎక్స్-డివిడెండ్‌గా మారిపోనున్నాయి.

జనవరి 25,2024న స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ప్రకారం.. పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై రూ.150 వన్-టైమ్ స్పెషల్ డివిడెండ్ ఇవ్వబడుతుందని కంపెనీ తెలిపింది. అదే సమయంలో రూ.10 ముఖ విలువ కలిగిన షేరుపై రూ.50 మధ్యంతర డివిడెండ్ ఇస్తోంది. ఈ డివిడెండ్ రికార్డు తేదీగా ఫిబ్రవరి 14ని కంపెనీ నిర్ణయించింది. 2023లో కంపెనీ ఒక షేరుపై రూ.95 డివిడెండ్ ఇచ్చింది.
Procter & Gamble Health Ltd తన పెట్టుబడిదారులకు 2001 నుంచి డివిడెండ్లను పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ ఒక్కసారి కూడా బోనస్ షేర్లను ఇవ్వలేదు. మంగళవారం కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 1.27 శాతం క్షీణతతో రూ.5492.60 స్థాయిలో ట్రేడవుతున్నాయి.


Click it and Unblock the Notifications