న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కసరత్తు ప్రారంభిస్తున్నారు. బడ్జెట్‌కు ముందు వివిధ రంగాల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇందులో భాగంగా డిసెంబర్ 14, సోమవారం నుండి నిర్మలమ్మ వివిధ వర్గాలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలు వర్చువల్‌గా జరగనున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన లోకసభకు సమర్పిస్తారు నిర్మలమ్మ. వివిధ వర్గాలతో సమావేశమై, వారి అభిప్రాయాలను సేకరించి, అనంతరం బడ్జెట్‌ను తయారు చేయడం సంప్రదాయంగా వస్తోంది. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వర్గాలు, రైతు సంఘాలు, ఆర్థిక వేత్తలు భేటీ అవుతారు. వీరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ప్రధాని మోడీతో వీటిపై చర్చిస్తారు.

కరోనా మహమ్మారి కారణంగా 2020-21 ఆర్థిక వ్యవస్థ తుడిచి పెట్టుకుపోయింది. ఈ ఏడాది మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో మొదటి త్రైమాసికంలో జీడీపీ మైనస్ 23.9 శాతంగా నమోదయింది. రెండో త్రైమాసికంలో మైనస్ 7.5 శాతంగా నమోదయింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ప్రతికూలంగానే ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది బడ్జెట్ కీలకంగా మారింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications