ముంబై: కరోనా నేపథ్యంలో మందగించిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (నవంబర్ 12) మరో ప్యాకేజీని ప్రకటించారు. తాజాగా కేంద్రం రూ.2.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. నిన్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(PLI) స్కీం, నేటి ప్యాకేజీ కలిపి 2.65 లక్షల కోట్లు. నేడు ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం, క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం పొడిగింపు, ఉత్పత్తికి ఊతమిచ్చే చర్యలు తీసుకున్నారు.

వివిధ రంగాలకు ఊతం
రియల్ ఎస్టేట్‌కు ఊతమిచ్చేలా డెవలరప్లు, గృహ కొనుగోలుదారులకు ఆదాయపు పన్నులో ఊరట కల్పించారు. వ్యవసాయానికి మద్దతు ఇచ్చే దిశగా ఎరువుల రాయితీకి రూ.65వేల కోట్లు ప్రకటించారు. దీంతో కోటి నలభై లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పీఎం గరీబ్ రోజ్‌గార్ యోజనకు అదనంగా రూ.10వేల కోట్లు కేటాయింపు, ఎగుమతులు పెంచేందుకు ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.3వేల కోట్ల కేటాయింపు, దేశీయ రక్షణ పరికరాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, గ్రీన్ ఎనర్జీ కోసం రూ.10,200 కోట్లు కేటాయించారు. కొవిడ్ వ్యాక్సీన్ అభివృద్ధి కోసం రూ.900 కోట్లు మంజూరు చేసింది. దేశీయ ఉత్పత్తికి ఊతమిచ్చేలా రూ.1.46 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు, మొబైల్ తయారీరంగాలకు రూ.51,355 కోట్లు ప్రకటించారు. స్వావలంబన పథకంలో భాగంగా 12 రకాల చర్యలను ఈ రోజు ప్రకటించారు.

రూ.29.87 లక్షల కోట్లు... జీడీపీలో 15 శాతం జీడీపీ
గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అంతకుముందు దాదాపు రెండు లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చింది. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులకు ఎల్టీసీ ప్రయోజనం కల్పించింది. తాజాగా, నిన్న, నేడు పలు రంగాలకు ప్యాకేజీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ.. ఈ రెండు కలిపి ఇప్పటి వరకు రూ.29.87 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అంటే దాదాపు రూ.30 లక్షల కోట్లు. భారత జీడీపీలో ఇది 15 శాతం.

ఉద్యోగాల కల్పనకు ఊతం
నిర్మలా సీతారామన్ ప్రకటించిన తాజా ప్యాకేజీలో పీఎం ఆవాస్ యోజనకు రూ.18వేల కోట్ల అదనపు నిధులు కేటాయించడం పండుగ సమయంలో శుభవార్త అని నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హీరానందానీ అన్నారు. ఇప్పటికే ఈ ఏడాది 8వేల కోట్లు కేటాయించారని, దీనికి అదనమని చెప్పారు. దీని ద్వారా మరిన్ని ఇళ్ల నిర్మాణానికి, తద్వారా ఇంటి కొనుగోలుదారులకు మరిన్ని ఇళ్లు అందుబాటులోకి రావడం, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగానికి ఇది దోహదపడుతుందన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications