న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఇంకాస్సేపట్లో లోక్‌సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. సుమారు రెండు గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రైల్వే బడ్జెట్‌ను కూడా నిర్మల సీతారామనే ప్రవేశపెడతారు. ఇదివరకు సార్వత్రిక బడ్జెట్, రైల్వే బడ్జెట్ వేర్వేరుగా కొనసాగాయి. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఏర్పాటైన తరువాత ఈ రెండింటినీ విలీనం చేసింది.
బడ్జెట్ ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గం ఈ ఉదయం సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి అధ్యక్షత వహిస్తారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదంచడం కోసమే కేబినెట్‌ను సమావేశపరిచారు. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన హైలైట్స్‌ను ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయం ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం, ఇతర మంత్రులకు సర్కులేట్ చేసింది. బడ్జెట్ హైలైట్స్‌కు సంబంధించిన వివరాలను మంత్రివర్గ సమావేశంలో నిర్మల సీతారామన్ ప్రస్తావిస్తారు. క్లుప్తంగా వాటి గురించి వివరిస్తారు.
కాగా- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బడ్జెట్ కోలాహలం నెలకొంది. ఆ శాఖ అధికారులు 7 గంటలకే నార్త్‌బ్లాక్‌లోని తమ కార్యాలయానికి చేరుకున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలతో కూడిన బహీఖాతాను సిద్ధం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆ శాఖ సహాయ మంత్రులు భగవత్ కరద్, పంకజ్ చౌధురి కొద్దిసేపటి కిందటే నార్త్ బ్లాక్‌కు చేరుకున్నారు. నార్త్ బ్లాక్ కార్యాలయానికి చేరుకోవడానికి ముందు భగవత్ కరద్.. తన అధికారిక నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు.

నార్త్ బ్లాక్ వద్ద పంకజ్ చౌధురి.. తనను కలిసిన విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. బడ్జెట్ స్వరూపం ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. నిర్మల సీతారామన్.. సమ్మిళిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాలకు ప్రయోజనాలు కలిగించేలా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులు సహా ఏ ఒక్క వర్గానికి చెందిన వారికి కూడా నిరాశను కల్పించబోదని తాను బలంగా విశ్వసిస్తున్నానని వ్యాఖ్యానించారు.
బడ్జెట్ ప్రతిపాదనలపై దేశ ప్రజలు ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టకున్నారని, వారిని ఎవరినీ నిరాశపరచబోమని చెప్పారు. మంత్రివర్గ ఆమోదం పొందిన వెంటనే ఆమె పార్లమెంట్ భవనానికి బయలుదేరి వెళ్తారు. సరిగ్గా 11 గంటలకు లోక్‌సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. అంతకుముందు- ఆమె ఈ ఉదయం 8:45 నిమిషాలకు గంటలకు నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకుంటారు. 9 గంటలకు బహీఖాతాను తీసుకుని మంత్రివర్గ సమావేశానికి బయలుదేరి వెళ్తారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications