ఇండియాలో ఏం జరుగుతుందో గ్లోబల్ ఇన్వెస్టర్లు ఒక్కసారి చూడాలి: Nirmala Sitharaman
Indian Economy: భారతదేశంలో ఏమి జరుగుతుందో చూడాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టుబడిదారులను కోరారు. దేశంలోకి ఒక్కసారి కూడా అడుగు పెట్టని వ్యక్తుల అభిప్రాయాలను పక్కనపెట్టాలని నిర్మలమ్మ గ్లోబల్ ఇన్వెస్టర్లకు సూచించారు. పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (PIIE)లో జరిగిన ఫైర్‌సైడ్ చాట్‌లో ఆమె భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల మాదిరిగా భారాన్ని మోస్తోందని అన్నారు. కరోనా తర్వాత ఎకానమీ తిరిగి గాడిన పడటానికి భారత ప్రజలు తమ వంతు తోడ్పాటును అందిస్తున్నారని ఆర్థిక మంత్రి వెల్లడించారు. దేశీయ డిమాండ్ తో పాటు విదేశాలకు ఎగుమతి కోసం వస్తువులను ఉత్పత్తి చేసే కంపెనీలకు పీఎల్ఐ స్కీమ్ కింద ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు నిర్మలమ్మ స్పష్టం చేశారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ రింత ప్రగతిశీలంగా ఉండాలని, అన్ని దేశాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, సభ్యులందరికీ న్యాయంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్ ప్రపంచీకరణ ప్రయోజనాలను తిప్పికొట్టాలని కోరుకోవడం లేదన్న నిర్మలమ్మ.. గ్లోబలైజేషన్ మరింత పారదర్శకంగా మర్చాలని అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో ముస్లిం జనాభా గురించి అడిగిన ప్రశ్నలకు సూటిగా బదులిచ్చారు.
2014లో డాలర్ పరంగా 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన విషయాన్ని నిర్మలా సీతారామన్ ప్రస్థావించారు. దేశీయ సవాళ్ల మధ్య స్థిరమైన వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నిర్మాణాత్మక సంస్కరణల విధానం భారతదేశం పెట్టుబడులకు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ఆమె తెలిపారు. భారత్ తన ఆర్థిక వ్యవస్థను ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక ప్రవాహాలతో ఏకీకృతం చేసిందని, అదే సమయంలో భారతీయ కుటుంబాలకు ఉన్నత, మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తోందని అన్నారు.


Click it and Unblock the Notifications