మధ్య తరగతి వస్త్రధారణలో నిర్మలమ్మ: ముదురు గోధుమరంగు చీర..అర్థం ఇదే
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. లోక్‌సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. ఈ ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభించారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలను చదవటం మొదలు పెట్టారు. ఈ సంవత్సరం మార్చి 31వ తేదీన ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 9.27 శాతంగా అంచనా వేసినట్లు చెప్పారు. దీన్ని అందుకుంటామనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. పలు పథకాలను ప్రకటించారు. మౌలిక రంగానికి పెద్ద పీట వేశామని అన్నారు.
Digital Currency India: పన్నుల పరిధిలోకి ఆ కరెన్సీ: భారీగా వడ్డింపు: 30% భారం
బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటను ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ట్యాక్స్‌పేయర్లకు ఊపిరి పీల్చుకునే వెసలుబాటును ఇచ్చారు. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక లోపాలను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ తాజా ప్రకటన చేశారు. ఎర్రర్లు, సాంకేతిక లోపాల వల్ల కోట్లాదిమంది పన్ను చెల్లింపుదారులు పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటోన్నందున వారికి ఊరట కల్పించే ప్రకటన చేశారు. ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి రెండు సంవత్సరాల వరకు గడువు ఇచ్చారు.

బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించే సమయంలో నిర్మల సీతారామన్ సాధారణ వస్త్రధారణలో, మధ్య తరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా కనిపించారు. మెరూన్ రెడ్ అంచు ఉన్న ముదురు గోధుమరంగు చీరెను ధరించారామె. ముదురు గోధుమరంగు స్థితప్రజ్ఞతకు నిదర్శనం. ఎరుపు రంగు శక్తికి అర్థం. నార్త్ బ్లాక్‌లోని తన కార్యాలయానికి కారులో వచ్చిన సమయంలో తెల్లరంగు శాలువ, అదే రంగు మాస్క్‌ను ధరించి కనిపించారు. ఎప్పట్లా తనకు అలవాటైన బిందీ నుదుట ధరించారు. చెవులకు తేలికపాటి దుద్దులు పెట్టుకున్నారు.
దేశానికి ఆర్థికమంత్రిగా పని చేస్తున్నప్పటికీ.. నిర్మల సీతారామన్ ఎప్పుడూ పెద్దగా ఆడంబరంగా దుస్తులను ధరించరు. ఈ విషయం పలు సందర్భాల్లో స్పష్టమైంది. చేనేత, కాటన్ చీరెలను ఆమె ఇష్టపడతారు. చాలా సింపుల్‌గా, మధ్య తరగతిని ప్రతిబింబించేలా కనిపిస్తుంటారు. అనర్గళంగా ఇంగ్లీష్‌ను మాట్లాడగలుగుతారు. అదే స్థాయిలో తెలుగు, తమిళం, హిందీని మాట్లాడగలరు. ఆర్థికరంగం మీద మంచి పట్టు ఉండటం వల్లే- ఈ కీలక శాఖను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమె చేతికి అప్పగించారు.
అనంతరం నార్త్‌బ్లాక్ వద్ద తన సహాయ మంత్రులు భగవత్ కరద్, పంకజ్ చౌధురి, ఇతర అధికారులు ఫొటో దిగారు. అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ వద్దకు వెళ్లారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన సమయంలోనూ ముఖానికి తెల్లరంగు మాస్క్ దరించే కనిపించారు. ఆయనతో గ్రూప్ ఫొటో దిగే సమయంలో మాస్క్‌ను తొలగించారు. అక్కడి నుంచి కారులో పార్లమెంట్ భవనానికి చేరుకున్న సమయంలోనూ మాస్క్‌తో కనిపించినప్పటికీ.. ఆ తరువాత దాన్ని తొలగించారు.


Click it and Unblock the Notifications