న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు(జూన్ 28, సోమవారం) మీడియా ముందుకు రానున్నారు. నిర్మలమ్మ కరోనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అలాగే బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు అంశానికి సంబంధించి మాట్లాడనున్నారని అంచనా. గత ఏడాది కరోనా కారణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పలుమార్లు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల సెకండ్ వేవ్ కూడా ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టాక కేంద్రం ఆర్థిక ప్యాకేజీతో ముందుకు వస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. తాజాగా నిర్మలమ్మ మీడియా ముందుకు రావడం ఆర్థిక ప్యాకేజీ ప్రకటనకేనని భావిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా దారుణంగా దెబ్బతిన్న వివిధ రంగాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అలాగే, కేంద్రం బ్యాడ్ బ్యాంకు నిర్మాణం కోసం రూ.31,000 కోట్లను కేటాయించింది. కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న వివిధ రంగాలు, కార్మికులు, ఉద్యోగులు కూడా పలు రకాల డిమాండ్లతో ముందుకు వస్తున్నారు.

తమ తమ రంగాలను ఆదుకోవాలని వివిధ రంగాలు కోరుతున్నాయి. ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారెంటీ స్కీంను రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలని కంపెనీలు కోరుతున్నాయి. లోన్ మారటోరియం మరోసారి ఇవ్వాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ ఏం ప్రకటన చేస్తారోననే ఆసక్తి అందరిలోను నెలకొంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications