న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు అందే ఆదాయం.. ప్రతి నెలా పెరుగుతోంది. రికార్డుస్థాయి కలెక్షన్లు వసూలవుతోన్నాయి. కిందటి నెలలో వసూలయిన జీఎస్టీ రెవెన్యూ రికార్డులను తిరగరాసింది. 1,60,122 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. ఐజీఎస్టీ రూపంలో 82,907 కోట్ల రూపాయలు అందాయి కేంద్ర ప్రభుత్వానికి.
సీజీఎస్టీ-29,546 కోట్ల రూపాయలు, ఎస్జీఎస్టీ- 37,314 కోట్ల రూపాయలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెట్ జీఎస్టీ వసూళ్లు లక్షన్నర కోట్ల రూపాయల మార్కును దాటింది. దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత ఇది రెండో రికార్డ్ కలెక్షన్లు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో ఐజీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.

జీఎస్టీ రూపంలో అందే ఆదాయాన్ని మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. జీఎస్టీ వసూళ్ల సంఖ్యను రెండు లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలనేది కేంద్రం లక్ష్యం. దీన్ని అందుకోవడానికి జీఎస్టీలో కొన్ని కీలక మార్పులను ప్రతిపాదించనుంది. ఈ దిశగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇప్పటికే రంగంలోకి దిగారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండెరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్‌కు ఆదేశాలను జారీ చేశారు కూడా.
జీఎస్టీ చెల్లింపుదారుల సంఖ్యను పెంచాలంటూ నిర్మల సీతారామన్ ఆదేశించారు. దీనికోసం- ఆటోమేటెడ్ జీఎస్టీ రిటర్న్ స్క్రూటినీ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని సూచించారు. వారం రోజుల్లోగా జీఎస్టీ రిటర్న్ స్క్రూటినీలో ఆటోమేటెడ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకుని రావాలంటూ డెడ్‌లైన్ విధించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల రూపంలో నమోదైన వసూళ్లు 13.82 లక్షల కోట్ల రూపాయలు.

2021-22 నాటి ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా అధికం. 2021-22లో 12.89 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ మొత్తం వసూలయ్యాయి. మేలో నమోదయ్యే జీఎస్టీ వసూళ్ల సంఖ్య ఖచ్చితంగా పెరగాల్సి ఉంటుందని, ఇప్పటివరకు అందిన కలెక్షన్లతో పోల్చుకుంటే ఈ సంఖ్య భారీగా పెరగాల్సి ఉందని సీబీఐసీ అధికారులను సూచించారు నిర్మల సీతారామన్.
సీబీఐసీ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో నిర్మల సీతారామన్ పాల్గొన్నారు. వారంలోగా ఆటోమేటెడ్ జీఎస్టీ రిటర్న్ స్క్రూటినీని ప్రవేశపెట్టాలని, సాంకేతికతను మెరుగుపరచుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచాలని అన్నారు. దీనికోసం ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. పన్ను చెల్లింపుదారుల సేవలను నిరంతరం మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications