For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wall Street Journal: అమెరికా వార్తా పత్రికలో నిర్మలమ్మ.. మోస్ట్ వాంటెడ్ అంటూ ప్రకటన.. దుమారం

|

Nirmala Sitharaman: అమెరికా వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురితమైన ప్రకటన పెద్ద దుమారంగా మారింది. ఈ ప్రకటనకుగాను సంస్థ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ పెరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటనలో ఉన్న తరుణంలో భారత అధికారుల జాబితాను మోస్ట్ వాంటెడ్ అనే పేరుతో ప్రచురించటం తీవ్ర చర్చకు దారి తీసింది.

అధికార దుర్వినియోగం..

ప్రకటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సహా 14 మందిని వాంటెడ్ జాబితాలో చేర్చి నిషేధించాలని అందులోని సారాంశం. జాబితాలోని వ్యక్తులు రాజకీయ, పారిశ్రామిక ప్రపంచంలోని ప్రత్యర్థులపై భారత రాజ్యాంగ సంస్థలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని సంస్థల దుర్వినియోగం వల్ల పెట్టుబడిదారుల విశ్వసనీయతను భారత్ కోల్పోయిందని ఆరోపించింది.

14 మంది ఎవరంటే..

నిర్మలా సీతారామన్ తర్వాత ఈ జాబితాలో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి హేమంత్ గుప్తా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఆంట్రిక్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాకేష్ శశిభూషణ్, వి. రామసుబ్రమణ్యం, స్పెషల్ పీసీ (అవినీతి నిరోధక) చట్టం న్యాయమూర్తి చంద్రశేఖర్, సీబీఐ డీఎస్పీ ఆశిష్ పరీక్, ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా, అదనపు సొలిసిటర్ జనరల్ ఉన్నారు. వెంకటరమణ పేర్లు ఉన్నాయి. దీంతో పాటు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రాజేష్, డిప్యూటీ డైరెక్టర్ ఎ. సాదిక్ మహ్మద్ పేర్లు పత్రికా ప్రకటనలో ఉన్నాయి.

 కారణం ఆయనేనా..?

కారణం ఆయనేనా..?

ఈ ప్రకటనకు దేవాస్ మల్టీమీడియా మాజీ సీఈవో రామచంద్రన్ విశ్వనాథన్ కారణమని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా తెలిపారు. ఈ ప్రకటనపై అనేక మంది ప్రముఖులు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు.

 రామచంద్ర విశ్వనాథన్ ఎవరు?

రామచంద్ర విశ్వనాథన్ ఎవరు?

విశ్వనాథన్ యాజమాన్యంలోని దేవాస్ మల్టీమీడియా అభివృద్ధి చేస్తున్న వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్‌ ఒప్పందాన్ని 2011లో రద్దు చేయటంతో వివాదం మెుదలైంది. అప్పటి నుంచి భారత ప్రభుత్వం, రామచంద్ర మధ్య గొడవ మెుదలైంది. ఆయనకు చెందిన స్టార్టప్‌ను మే 2021లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) లిక్విడేట్ చేసింది. 2005లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన ఆంట్రిక్స్ తో శాటిలైట్ డీల్ జరిగిన తర్వాత ఆయన రూ.529 కోట్ల విదేశీ పెట్టుబడులను దారి మళ్లించినందుకు విశ్వనాథన్, మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేయబడింది. ఆ తర్వాత ఈడీ దాడులు, కేసులు జరిగాయి.

English summary

Wall Street Journal: అమెరికా వార్తా పత్రికలో నిర్మలమ్మ.. మోస్ట్ వాంటెడ్ అంటూ ప్రకటన.. దుమారం | FM nirmala sitharaman as most wanted add of wall street journal going viral

FM nirmala sitharaman as most wanted add of wall street journal going viral
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X