న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్కసారిగా దేశ ప్రజలపై వరాల సునామీని కురిపించింది. గత ఏడాది దీపావళి సమయంలో పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినట్టుగానే ఈ దఫా కూడా వాటి రేట్లను తగ్గించింది. పెట్రోల్, డీజిల్‌పై అమలు చేస్తోన్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని మరో విడత తగ్గించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లను పోస్ట్ చేశారు.
పెట్రోల్, డీజిల్‌పై..
పెట్రోల్‌పై అమలు చేస్తోన్న ఎక్సైజ్ డ్యూటీలో ఎనిమిది రూపాయలను తగ్గించినట్లు నిర్మల సీతారామన్ చెప్పారు. దీని ఫలితంగా- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.9.50 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి ఏడు రూపాయల మేర తగ్గతుంది. తగ్గించిన రేట్లు ఆదివారం తెల్లవారు జామున 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. గత ఏడాది దీపావళి సమయంలో తాము ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినప్పటికీ..కొన్ని రాష్ట్రాలు వాటిని అమలు చేయలేదని, ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో వాహనదారులపై భారం యధాతథంగా కొనసాగిందని గుర్తు చేశారు.
ఉజ్వల యోజన కింద సిలిండర్లపై..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అందజేసే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ ధరలో కేంద్ర ప్రభుత్వం 200 రూపాయల సబ్సిడీని ప్రకటించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్లకు పైగా కుటుంబాలకు లబ్ది కలుగుతుంది. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం, దీపం పథకం కింద మంజూరయ్యే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లపై రూ.200 ల సబ్సిడీ వల్ల ఖజానాపై ఆర్థికభారం పడినప్పటికీ.. పేదల సంక్షేమమే ముఖ్యమని నిర్మల సీతారామన్ చెప్పారు.
ప్లాస్టిక్ ఉత్పత్తులపై..
ప్లాస్టిక్ ఉత్పత్తులపైనా కస్టమ్స్ డ్యూటీని తగ్గించినట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. ప్లాస్టిక్‌ను తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు, ఇతర ఇంటర్మీడియరీస్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపును వర్తింపజేసినట్లు చెప్పారు. ఫలితంగా- ప్లాస్టిక్ ఆధారిత వస్తువుల ధర చాలావరకు తగ్గుముఖం పడుతుందని, వాటి తయారీ ఖర్చును భారీగా తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు. ఇనుము, ఉక్కు తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై విధించే కస్టమ్స్ డ్యూటీని క్రమబద్దీకరించామని, ఫలితంగా వాటి ధరలు తగ్గుతాయని అన్నారు. అలాగే- స్టీల్ ముడి సరుకుల ఎగుమతులపై విధించే కస్టమ్స్ డ్యూటీని సైతం తగ్గించినట్లు చెప్పారు.
ఎరువులపై సబ్సిడీ..
ఈ క్రమంలో రైతులపైనా నిర్మల సీతారామన్ వరాల జల్లును కురిపించారు. ఎరువులపై అమలు చేస్తోన్న సబ్సిడీ మొత్తాన్ని రెట్టింపు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఎరువులపై 1.05 లక్షల కోట్ల రూపాయల ఫర్టిలైజర్ సబ్సిడీని ప్రకటించామని గుర్తు చేశారు. ఇప్పుడు దీనికి అదనంగా 1.10 లక్షల కోట్లన సబ్సిడీని జత చేస్తామని స్పష్టం చేశారు.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Petrol prices: పెట్రోల్, డీజిల్‌పై రూ. 10 పన్ను తగ్గింపు.. అయినా సామాన్యులకు ఊరట లేదు! ఏందుకంటే..

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

భారీగా పెరిగిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై టికెట్ ఛార్జీల మోత తప్పదిక..

Oil prices: ముదురుతున్న యుద్ధం! ఊహించని స్థాయిలో ఆయిల్ రేట్లు పెరగనున్నాయా?

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications