Banking News: బ్యాంకులపై పెద్దఎత్తున విమర్శలు.. సైలెంట్‌గా 8 వేల కోట్లు స్వాహా.. ఇదీ నిర్మలమ్మ ఆన్సర్
Minimum Balance: అంతర్జాతీయ విపణిలో భారత ఆర్థిక వ్యవస్థ 'బ్రైట్ స్పాట్'గా నిలవడంలో ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు కూడా ఓ కారణమని చెప్పక తప్పదు. ముఖ్యంగా జన్ ధన్ ఖాతాల ద్వారా యావత్ ప్రజానీకాన్ని ఆర్థికాభివృద్ధిలో భాగం చేశారు. దాని ద్వారా కరోనా వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంతో మంది సాయం పొందారు.
అయితే భారతీయ బ్యాంకింగ్ రంగంపై ఓ విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనాభాకు, డిమాండ్‌కు తగిన స్థాయిలో ATMలను నెలకొల్పడంలో చూసీచుడనట్లు పోతున్న బ్యాంకులు.. ప్రజల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీలు వసూలు చేయడం ఆగ్రహానికి కారణమవుతోంది. ఉన్న ATMలలో కూడా సరిగా నగదు అందుబాటులో లేకపోవడం, లోపాలు తలెత్తడాన్ని భరించలేక పోతున్నారు.

ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ఏమాత్రం శ్రద్ధ చూపకుండా బ్యాంకులు వేలాది కోట్లను ప్రజల నుంచి లూటీ చేస్తున్నాయనంటూ ఆందోళన రేగుతోంది. ఇదే విషయంపై ఓ సభ్యుడు పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో బ్యాంక్ ఖాతాల్లో కనీస నిల్వలు లేవంటూ ప్రభుత్వరంగ బ్యాంకులు ఖాతాదారుల నుంచి ఏకంగా 8 వేల 500 కోట్లను పెనాల్టీల రూపంలో వసూలు చేయడాన్ని హైలెట్ చేశారు.
సదరు సభ్యుని ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. PM జన్ ధన్ సహా పేదల కోసం ఉద్దేశించిన బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ వర్తించదని వెల్లడించారు. కాగా గత నెలలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి FY24లో ఈ విధంగా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు డిపాజిటర్ల నుంచి 2 వేల 331 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు ప్రకటించారు. అయితే ఈ స్థాయిలో ప్రభుత్వమే ప్రజలను లూటీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications