ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (మే 17) రంగాలకు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ రోజు ఏడు రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా కంపెనీలకు ఊరటనిచ్చే ప్రకటన చేశారు.
కరోనా మహమ్మారి-లాక్ డౌన్ కారణంగా దేశంలో వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని నిర్మల చెప్పారు. ఈ వైరస్ వల్ల కలిగిన నష్టాలకు దివాళా స్మృతి నుండి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. నష్టాలకు సంబంధించి ఏడాది వరకు దివాళా ప్రక్రియల నుండి మినహాయింపు ఉంటుందన్నారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రత్యేక దివాళా విధివిధానాలు ఉంటాయన్నారు. కంపెనీల ఒప్పందాల కాలపరిమితి పొడిగించేందుకు కొన్ని వెసులుబాట్లు ఇస్తామన్నారు. కంపెనీల ఒప్పందాల అభియోగాలపై చట్టపరమైన రక్షణ కల్పించేలా కంపెనీల చట్ట సవరణ ఉంటుందన్నారు.
కంపెనీల చట్టంలో మార్పుల ద్వారా ఇప్పటి వరకు నేరపూరితంగా పరిగణిస్తున్న 7 అంశాలను తొలగిస్తామన్నారు. ఏడు రకాల వాణిజ్య నేరాలను నేర శిక్ష్మాస్మృతి నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. నేరపూరిత అంశాలుగా పరిగణించకపోవడం వల్ల కంపెనీలకు తక్షణం ఊరట ఉంటుందని చెప్పారు. అనుమతించిన విదేశాల్లో పబ్లిక్ కంపెనీలు నేరుగా సెక్యూరిటీలను లిస్ట్ చేసుకోవచ్చునని చెప్పారు.

ప్రతి రంగంలోను ఒక ప్రభుత్వరంగ సంస్థ తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో ప్రతి రంగంలో ప్రయివేటు పెట్టుబడులను కూడా అనుమతిస్తామన్నారు. నోటిఫై చేసిన రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు తప్పకుండా ఉంటాయన్నారు. నోటిఫై చేసిన రంగాల్లో కనీసం ఒక్క ప్రభుత్వరంగ సంస్థ ఉంటుందన్నారు. ఇప్పటికే ఒకటే రంగంలో ఒకటికి మించి ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను హేతుబద్దీకరిస్తామన్నారు.
10 సంస్థలు ఉంటే ఒకటి గాను లేదా మూడు, నాలుగు సంస్థలుగా విలీనం చేస్తామన్నారు. నోటిఫై చేసిన రంగాల్లో అత్యధికంగా 4 మాత్రమే ప్రభుత్వరంగ సంస్థలు ఉంటాయని చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లో కూడా ప్రయివేటు రంగానికి తగిన ప్రాధాన్యం, ఏకరూపత ఇస్తామన్నారు. పీఎం కేర్స్ నిధికి ఇచ్చే విరాళాలను కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద చేర్చినట్లు చెప్పారు నిర్మల.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications