ఫ్లిప్‌కార్ట్ 'ఇయర్ ఎండ్ సేల్' శనివారం మొదలైంది. ఈ సేల్ ఈ నెల 23 వరకు కొనసాగనుంది. 'ఇయర్ ఎండ్ సేల్' సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లతోపాటు అత్యద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై 75 శాతం రాయితీ ప్రకటించింది.
మొబైల్స్‌పై అద్భుతమైన డీల్స్...
ఫ్లిప్‌కార్ట్ తన 'ఇయర్ ఎండ్ సేల్'లో భాగంగా ఐఫోన్7, రెడ్‌మి నోట్ 7ప్రొ, రెడ్‌మి8, రియల్‌మి 5ప్రొ, వివో జడ్1ప్రొతోపాటు మరిన్ని మొబైల్స్‌పై భారీ రాయితీలు ప్రకటించింది. ఐఫోన్ 8ని రూ.33,999కి, ఐఫోన్ ఎక్స్‌ఎస్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.59,990కి అందుబాటులో ఉంచింది. ఇంకా రెడ్‌మి నోట్7 ప్రొ 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.9,999కే అందుబాటులో ఉంచింది. అంటే ఏకంగా రూ.4 వేల రాయితీ ఇస్తోందన్నమాట.

ఇక రియల్‌మి 5 ప్రొ 4జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్‌పై రూ.2 వేలు తగ్గించి రూ.11,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. 6జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్‌ను రూ.12,999కి, 8జీబీ ర్యామ్/128 జీబీ వేరియంట్‌ను రూ.14,999కి అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే పిక్సెల్ 3ఎ ఎక్స్ఎల్‌ను రూ.30,999కి, శాంసంగ్ గెలాక్సీ ఎస్9ప్లస్‌ను రూ.29,999కి అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇంకా.. రెడ్‌మి8 4జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.7,999కి, వివో జడ్1 ప్రొ 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.12,990కి, 6జీబీ ర్యామ్/64జీబీ వేరియంట్‌ను రూ.13,990కి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితోపాటు రెడ్‌మి కె20 4జీబీ/128 జీబీ వేరియంట్‌పై రూ. 4 వేలు, 8జీబీ/128 జీబీ వేరియంట్‌పై వెయ్యి రూపాయల రాయితీ ప్రకటించింది.
ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం రాయితీ..
'ఇయర్ ఎండ్ సేల్'లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే ల్యాప్‌టాప్‌లు, యాపిల్ వాచ్‌లు, స్పోర్ట్స్ కెమెరాలు, పవర్ బ్యాంకులు వంటివాటిపైనా భారీ రాయితీలను ఆఫర్ చేస్తోంది. ల్యాప్‌టాప్‌లను రూ.19,999 నుంచి ప్రారంభించగా.. రియల్‌మి 5 ప్రొను రూ.11,999కి, రియల్‌మి 8ను రూ.8,999కి అందుబాటులోకి తీసుకొచ్చింది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications