Flipkart UPI: భారత్ వంటి పెద్ద దేశంలో వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లాలంటే దానికి ముఖ్యమైనది ప్రజల నుంచి స్పందన. దీనిని సరిగ్గా ఒడిసిపట్టిన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ అని చెప్పటంలో ఏమాత్రం అనుమానపడాల్సిన అవసరం లేదు. అయితే ఇదే దారిని ప్రస్తుతం మరికొన్ని కంపెనీలు సైతం వాడేస్తున్నాయి. తమ వ్యాపారాలను వినియోగదారులకు చేరువ చేసేందుకు ఈ మార్గాన్ని సదరు సంస్థలు యూజ్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇటీవలి కాలంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈ క్రమంలోనే ఈకామర్స్ దిగ్గజం బెంగళూరు ప్రజల కోసం ఒక అద్భుతమైన ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం కేవలం రూ.1కే ఆటో రైడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్థానిక ఆటో డ్రైవర్‌లతో భాగస్వామ్యం కావటం ద్వారా తమ యూపీఐ చెల్లింపుల వ్యవస్థను విస్తృత స్థాయిలో ప్రోత్సహించాలని ఫ్లిప్‌కార్ట్ ప్లాన్ చేసింది.

కంపెనీ ప్రకటించిన ఆఫర్ కారణంగా బెంగళూరు ప్రజలు రద్దీ సమయాల్లో తక్కువ ఖర్చుతో రూ.1కే రైడ్ బుక్ చేసుకునేందుకు ఆసక్తి కనబరిచినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ ఈ రైడ్‌లను బుక్ చేసుకునేందుకు ప్రజలకు సహాయం చేయడానికి నగరంలోని కీలకమైన ప్రదేశాల్లో స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ గురించి ప్రజలకు అవగాహన కలిగించటానికి ఇది పరోక్షమంగా దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ చేసిన వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్న బెంగళూరీలు తమ వంతు రైడ్ కోసం నిరీక్షిస్తున్నారు.
దీనిపై నెటిజన్లు తమ స్పందనను సోషల్ మీడియాలో పంచుకుంటు్నారు. బెంగళూరు వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగానే ఈ ఆఫర్ దేశంలోని వివిధ నగరాలకు విస్తరించేందుకు కంపెనీ చొరవ చూపాలని కొందరు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి అమితా బచన్ తో కూడిన యాడ్ హోర్డింగ్స్ బెంగళూరు నగరంలోని ఆటో స్టాల్స్ వద్ద కనిపిస్తున్నాయి. ఈ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉండనుందనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. చాలా మంది దీనిని తెలివైన మార్కెటింగ్ క్యాంపెయిన్ అని సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. ఈ క్యాంపెయిన్ పోటీదారుడైన అమెజాన్ కు మతిపోగొడుతోందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications