Big Billion Days: దినదినాభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ రంగం వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటుంది. ఫ్లాష్ సేల్స్ పేరిట భారీ ఆఫర్లను యూజర్ల ముందు పెడుతూ వారిని ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాయి. అయితే ఇంత చేసినా ఆయా ఉత్పత్తులు సమయానికి డెలివరీ కావడం లేదని కస్టమర్లు ఆగ్రహమ వ్యక్తం చేయడం కోకొల్లలు. సరిగ్గా దీన్ని గాడిలో పెట్టేందుకు ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఫ్లిప్‌కార్ట్ త్వరలో ప్రారంభించనున్న 'ది బిగ్ బిలియన్ డేస్ (TBBD)' సేల్ కోసం పక్కాగా అన్నీ సిద్ధం చేసుకుంచోంది. రాబోయే పండుగ సీజన్ సమయంలో ఊహిస్తున్న అధిక డిమాండ్‌ను తీర్చడానికి 9 నగరాల్లో 11 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయనుంది. ఆయా ఇ-కామర్స్ మరియు క్విక్ కామర్స్ సంస్థలు తమ సరఫరా గొలుసుతో పాటు మౌలిక సదుపాయాలను విస్తరించే ప్రణాళికల్లో భాగంగా దేశీయ ఇ-కామర్స్ మేజర్ చర్యలు మొదలుపెట్టింది.

ఈ కొత్త వాటితో కలిపి దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ మొత్తం 83 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ ను నిర్వహిస్తుంది. అంతేకాకుండా సరఫరా గొలుసు అంతటా భారత్‌లో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని కంపెనీ తెలిపింది. ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్‌హౌస్ అసోసియేట్‌లు, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్‌లు, కిరానా భాగస్వాములు మరియు డెలివరీ డ్రైవర్‌లతో సహా వివిధ సప్లై చైన్ విభాగాల్లో ఈ జాబ్స్ ఉంటాయని వెల్లడించింది.
ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ వేళ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండే విధంగా ముందు నుంచే ఆచితూచి వ్యవహరిస్తోంది. కంపెనీ షిప్‌మెంట్ డెలివరీ సామర్థ్యాన్ని పెంచడం, వేగవంతమైన మరియు మరింత విశ్వసనీయమైన డెలివరీ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. పండుగ సీజన్‌లో కొత్త కార్మికుల కోసం సమగ్ర నైపుణ్య మరియు శిక్షణ కార్యక్రమాలను కూడా ప్లాన్ చేసింది.


Click it and Unblock the Notifications