Flipkart sale: ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ వస్తోంది! ఐఫోన్ 17, ల్యాప్‌టాప్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు!
మీరు కొత్త ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మరికొన్ని రోజులు ఆగండి! ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన మోస్ట్ అవైటెడ్ 'సాసా లేలే' (Sasa Lele) సేల్ 2026ను ప్రకటించింది. మే 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లు మరియు ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని క్రేజీ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే టీజ్ చేయడం మొదలుపెట్టింది.

ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
ఈసారి సేల్ (Flipkart sale) లో పాత మోడల్స్ మాత్రమే కాదు, 2025 మరియు 2026లో లాంచ్ అయిన కొత్త ల్యాప్‌టాప్‌లపై కూడా మంచి తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా..
- Samsung Galaxy Book 4: శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 అసలు ధర రూ. 89,689 కాగా, సేల్‌లో కేవలం రూ. 58,990 కే లభించనుంది.
- Asus Vivobook 14: ఆసుస్ వివోబుక్ 14 అసలు ధర రూ. 92,990 కాగా.. ఈ ల్యాప్‌టాప్ ఇప్పుడు రూ. 58,990 వద్ద అందుబాటులో ఉంటుంది.
- Motobook 60 OLED: మోటోబుక్ 60.. అసలు ధర రూ. 93,690 కాగా ఈ ప్రీమియం మెషిన్ ధర భారీగా తగ్గి రూ. 47,490 కు చేరుకోవచ్చు.
- వీటితో పాటు డెల్ (Dell 15 2024), హెచ్‌పీ (HP OmniBook 7 Aero) మోడల్స్‌పై కూడా కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి.
ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్!
స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఈ సేల్ హైలైట్ ఏదైనా ఉందంటే అది ఐఫోన్ 17 అని చెప్పాలి. 2025 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఐఫోన్ 17 (256GB) ధర ఇప్పుడు రూ. 71,999 (ఎఫెక్టివ్ ధర) కి పడిపోయింది. అంతేకాకుండా..
- iPhone 17 Pro Max: రూ. 1,49,900 ఉన్న ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ. 1,24,900 కే సొంతం చేసుకోవచ్చు.
- iPhone 16: గత ఏడాది మోడల్ అయిన ఐఫోన్ 16 ధర రూ. 58,900 వద్ద స్థిరపడింది.
- iPhone 15: పాత మోడల్ కావాలనుకునే వారికి ఇది కేవలం రూ. 51,900 కే అందుబాటులో ఉంటుంది.
అదనపు ప్రయోజనాలు ఇవే..
కేవలం ఫ్లాట్ డిస్కౌంట్లే కాకుండా, ఇతర బ్యాంక్ ఆఫర్లతో ధరను ఇంకా తగ్గించుకోవచ్చు. SBI క్రెడిట్ కార్డ్ వాడే వారికి EMI ట్రాన్సాక్షన్లపై 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, సూపర్ కాయిన్స్ మరియు UPI పేమెంట్స్ ద్వారా అదనపు తగ్గింపు పొందవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ (Flipkart sale) లో ప్లస్ సభ్యులకు ఈ సేల్ 24 గంటల ముందే అంటే మే 8 నుంచే ప్రారంభమవుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉండే మోడల్స్ త్వరగా స్టాక్ అయిపోయే అవకాశం ఉన్నందున, ముందుగానే కార్ట్ లో పెట్టుకోవడం ఉత్తమం. అదే సమయంలో అమెజాన్ 'గ్రేట్ సమ్మర్ సేల్' కూడా మే 8 నుంచే మొదలవుతోంది. కాబట్టి ప్రొడక్ట్ కొనే ముందు రెండు ప్లాట్‌ఫామ్స్‌లో ధరలను పోల్చి చూసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications