ఇ కామర్స్ రంగ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్(Flipkart) ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల విభాగంలో దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోది. రీఛార్జ్, బిల్లు చెల్లింపు కేటగిరీలలోకి ప్రవేశించింది. ఫ్లిప్‌కార్ట్ కొత్త కేటగిరీలో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్‌లు, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ పోస్ట్‌పెయిడ్ బిల్లు చెల్లింపులను చేర్చింది. ఇప్పుడు కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ యూపీఐ(UPI)ని ఉపయోగించి సూపర్ కయిన్స్ ని సంపాదించడం ద్వారా 10 శాతం వరకు ఆఫర్‌లను పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ తన యాప్‌లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ పోస్ట్‌పెయిడ్ బిల్లు చెల్లింపులతో సహా ఐదు కొత్త రీఛార్జ్, బిల్లు చెల్లింపు వర్గాలను ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో విద్యుత్, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ వంటి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ (BBPS)తో కొత్త సేవలను అనుసంధానించడానికి ఫ్లిప్‌కార్ట్ బిల్ డెక్స్ తో భాగస్వామ్యం కలిగి ఉంది.

ఇప్పుడు మీరు ఫ్లిప్‌కార్ట్ యూపీఐ నుంచి అందుకున్న సూపర్ కాయిన్‌ల ద్వారా 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. 2024 ఆర్థిక సంవత్సరంలో, BBPS (భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ) సుమారు 1.3 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఖ్య రూ. 3 బిలియన్లకు మించి ఉంటుందని అంచనా. భారత్ బిల్ చెల్లింపుల వ్యవస్థలో 20 కంటే ఎక్కువ రకాల బిల్లులు, 21,000 కంటే ఎక్కువ బిల్లర్లు ఉన్నాయి.
ఇప్పుడు 70 శాతానికి పైగా బిల్లుల చెల్లింపులు డిజిటల్ మార్గాల ద్వారానే జరుగుతున్నాయి. కొత్త కేటగిరీలను ప్రారంభించడం ద్వారా ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఆకర్షించడానికి ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నించింది. డిజిటల్ చెల్లింపుల రంగం విపరీతమైన ఊపందుకుంటోందని ఫ్లిప్‌కార్ట్ పేమెంట్స్ అండ్ సూపర్‌కాయిన్స్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ అరోరా అన్నారు. ఎక్కువ మంది ఎలక్ట్రానిక్ విధానంలో బిల్లుల చెల్లింపులు చేస్తున్నారని వివరించారు.


Click it and Unblock the Notifications