Flipkart: దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇటీవల తన 10వ ఎడిషన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను విజయవంతంగా నిర్వహించి, పెద్దఎత్తున వ్యాపారం జరిపింది. పండుగ సీజన్ కావడంతో మిలియన్ల కొద్దీ ఉత్పత్తులను విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంది. అయితే ఇదంతా కేవలం నాణానికి ఒకవైపు మాత్రమే కావడం గమనార్హం.
బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ రిలీజ్ చేసిన ఫైనాన్షియల్ డేటా ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏకీకృత నష్టం 4 వేల 890 కోట్లకు విస్తరించింది. FY2022లో వాల్‌మార్ట్ గ్రూపుకు చెందిన ఈ ఇ-కామర్స్ సంస్థ 3 వేల 371 కోట్ల ఏకీకృత నష్టాన్ని నమోదు చేసింది.

స్వతంత్ర ప్రాతిపదికన ఫ్లిప్‌కార్ట్ నికర నష్టం 4 వేల 839.3 కోట్లకు విస్తరించినట్లు నివేదిక పేర్కొంది. "మార్చి 31, 2023 నాటికి నికర నష్టం 48 వేల 393 మిలియన్లు. అంతకుముందు ఏడాది మార్చి 31, 2022 నాటికి ఇది 33 వేల 624 మిలియన్లుగా ఉంది. ప్రస్తుతం నికర నష్టంలో 44 శాతం పెరుగుదల కనిపించింది" అని ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక నివేదిక తెలిపింది.
నివేదిత ఆర్థిక సంవత్సరంలో ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయంతో సహా కంపెనీ ఏకీకృత నికర ఆదాయం 9.4 శాతం పెరిగింది. అంటే 2022 ఆర్థిక ఏడాదిలో నమోదైన 51 వేల 176 కోట్ల నుంచి FY23 నాటికి 56 వేల 012.8 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications