Flipkart Eat In: జొమాటో, స్విగ్గీలకు షాక్.. తక్కువ ధరకే ఫుడ్ అందించనున్న రాపిడో ఓన్లీ, ఫ్లిప్ కార్ట్ ఈట్ ఇన్..

ఫుడ్ డెలవరీ విభాగంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తూ భారీ లాభాలను పొందుతున్న జొమాటో, స్విగ్గీలకు ఫ్లిప్ కార్ట్ షాకిచ్చింది. వాల్‌మార్ట్ మద్దతు ఉన్నఫ్లిప్ కార్ట్, జొమాటో, స్విగ్గీల ఆధిపత్యంలో ఉన్న మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఫ్లిప్ కార్ట్ బెంగళూరులోని తమ ఉద్యోగుల మధ్య 'ఈట్ ఇన్' అనే ఫుడ్-డెలివరీ సేవను పరీక్షిస్తోంది. ఇక్కడ విజయవంతం అయితే పూర్తి స్థాయిలో ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి దిగనుంది. ఈ సేవను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ఫ్లిప్ కార్ట్ ఉద్యోగులందరికీ, ఆ తర్వాత బెంగళూరులోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పటికే జొమాటో, స్విగ్గీ పోటీగా రాపిడో ప్రారంభించిన జీరో-కమీషన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన ఓన్లీ, ఇప్పుడు బెంగళూరులో రోజుకు 50,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లను ప్రాసెస్ చేస్తోందని తెలుస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ నగరం అంతటా ప్రారంభమైన కేవలం ఐదు నెలలకే ఈ మైలురాయిని చేరుకుందని సమాచారం. స్విగ్గీ, జొమాటో కంటే తక్కువ ధరకే వినియోగదారులకు తక్కువ ధరలకే ఫుడ్ డెలివరీ చేస్తుండడంతో రాపిడోకు ఓన్లీ పుంజుకుంది. ఇప్పుడు ఫుడ్-డెలివరీ మార్కెట్‌లోఫ్లిప్ కార్ట్ ప్రవేశం జరగబోతుంది. రాపిడో, స్విగ్గీ, జొమాటోలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి, ధరల పట్ల శ్రద్ధ వహించే వినియోగదారులను ఆకర్షించడానికి విభిన్న మార్గాలతో ప్రయోగాలు చేస్తున్నాయి. జీరో-కమీషన్ పద్ధతిలో పనిచేసే రాపిడో 'ఓన్లీ', ఇటీవల బెంగళూరులో రోజుకు 50,000 ఫుడ్-డెలివరీ ఆర్డర్లను దాటింది.

Food Delivery

ఇది నగరంలో అంచనా వేయబడిన 500,000-600,000 రోజువారీ ఆర్డర్లలో దాదాపు 10 శాతానికి సమానం. స్విగ్గీ ధరల పట్ల సున్నితంగా ఉండే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, 'టాయింగ్' అనే ప్రత్యేక ఫుడ్-డెలివరీ యాప్‌తో అందుబాటు ధరల మార్గాన్ని ఎంచుకుంది. ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ గణనీయమైన ఆదరణ పొందింది. బ్రోకరేజ్ సంస్థ CLSA నివేదిక ప్రకారం టోయింగ్ వారపు క్రియాశీల వినియోగదారులు దాదాపు 33 మిలియన్లతో జొమాటోకు దగ్గరగా ఉన్నారు. అయితే జొమాటోకు దాదాపు 35 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.

జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్, ప్రత్యేక బడ్జెట్ ప్లాట్‌ఫామ్‌ను సృష్టించకూడదని నిర్ణయించుకుంది. ఇది జొమాటోలో తక్కువ ధరల ఆఫర్లను ప్రోత్సహిస్తూనే, తక్కువ ధరల ఆహారం కోసం ఒక విభిన్న నిర్వహణ నమూనాతో నిర్మించబడుతున్న బిస్ట్రోలో పెట్టుబడి పెడుతోంది. ఫ్లిప్ కార్ట్ కూడా పుడ్ డెలివరీ బిజినెస్ లోకి దిగితే వినియోగదారులకు తక్కువ ధరల్లో ఫుడ్ దొరికే అవకాశం ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)తో ఈట్ ఇన్‌ను నిర్మిస్తోంది మరియు రెస్టారెంట్‌ల కోసం తక్కువ కమీషన్ నిర్మాణం దిశగా పనిచేస్తోంది. ఉద్యోగులకు ఈ సేవను అందించడం ద్వారా, వినియోగదారులకు అందించే ముందు ఫ్లిప్ కార్ట్ ఈ సేవను మరియు దాని నిర్వహణ నమూనాని పరీక్షించుకోగలుగుతుంది.

ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ర్యాపిడో, ఫ్లిప్ కార్ట్ రాకతో జొమాటో, స్విగ్గీ కూడా ఛార్జీలు తగ్గించి రావాల్సి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ర్యాపిడో, ఫ్లిప్ కార్ట్ ఫుడ్ డెలివరీ బిజినెస్ ఎలా డ్రైవ్ చేస్తుందో చూడాలి. కాగా రాపిడో త్వరలో హైదరాబాద్ లో కూడా ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రారంభించే అవకాశం ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+