Flipkart News: వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని రారాజుగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చక్రం తిప్పుతున్నారు. అయితే పలు కారణాల వల్ల తమ కంపెనీ మద్ధతిస్తున్న డెలివరీ యాప్ డన్జో నష్టాల బాట పట్టింది. దీనిని అవకాశంగా తీసుకుని మరో దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం రంగంలోకి దిగినట్లు సమాచారం.
వాల్‌మార్ట్ మద్దతు కలిగిన ఫ్లిప్‌కార్ట్ ఆన్-డిమాండ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ డన్జోను కొనుగోలు చేయడం కోసం చర్చలు జరుపుతున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. కంపెనీ యాజమాన్యం చుట్టూ అలుముకున్న వివాదాస్పద సంక్లిష్టతలు.. ఈ డీల్ ముందుకు వెళ్లడానికి ప్రధాన ఇబ్బందిగా మారినట్లు పేర్కొంది. ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదరకుండా ఇదే వ్యవహారం అడ్డుపడుతున్నట్లు వెల్లడించింది.

కొనుగోలు చర్చలు డన్జోలో గందరగోళాన్ని రేపినట్లు సమాచారం. ఇప్పటికే సిబ్బందికి జీతాలు చెల్లంచేందుకు కూడా కంపెనీ కష్టపడుతోంది. ఇప్పటి వరకు సుమారు 500 మిలియన్ డాలర్లను సేకరించింది. ఇటీవలి త్రైమాసికాల్లో తన హైపర్ లోకల్ డెలివరీ మార్కెట్ వాటాను చాలా వరకు జెప్టో, స్విగ్గీ, జొమాటో ఆధారిత బ్లింకిట్ లకు వదులుకోవాల్సి వచ్చింది.
2022లో డన్జోలో 26 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం సొంతం చేసుకుంది. 200 మిలియన్ డాలర్లకు ఈ డీల్ జరిగింది. కాగా ఇప్పుడు నివేదించిన కొనుగోలు ఒప్పందాన్ని రిలయన్స్ తిరస్కరించింది. డన్జో కూడా తాము మార్చి 2024 నెలలో ఫ్రీ క్యాష్ ఫ్లో బ్రేక్ ఈవెన్ లో ఉన్నట్లు పేర్కొంది. వ్యాపార విక్రయానికి సంబంధించి ఎవరితోనూ చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications