Flipkart News: మరో కొత్త బిజినెస్‌లోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ.. ప్రత్యర్థి ప్లేయర్స్‌కు ఇక చుక్కలే..
మారుతున్న కాలంతో పాటు తమ సేవలను అప్ గ్రేడ్ చేయడంలో ఇ-కామర్స్ సైట్స్ ముందు వరుసలో ఉంటాయి. ఏదైనా సర్వీసెస్ ద్వారా రెవెన్యూ వస్తుంది అని తెలిస్తే చాలు ఠక్కన ఆ విభాగంలోకి దూకేస్తాయి. తాజాగా భారతీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీస్ ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.
దేశంలో కొన్ని స్టార్టప్‌లు మాత్రమే ఆఫర్ చేస్తున్న 10 నిమిషాల డెలివరీ సేవలను ఇకపై ఫ్లిప్‌కార్ట్ కూడా అందించనుంది. మీడియా ప్లాట్‌ఫారమ్ ఎంట్రాకర్ ప్రకారం.. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి విస్తృత మార్కెట్ ఉన్న నగరాల్లో మొదటగా ఈ సర్వీసులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, మొబైల్స్, దుస్తులు సహా లైఫ్ స్టైల్ ఉత్పత్తులను సాధ్యమైనంత త్వరగా డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ విభాగంలోకి అడుగుపెడుతోంది.

ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జొమాటో బ్లింక్‌ఇట్, జెప్టో వంటి పేయర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ నుంచి గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే డెలివరీ సామర్ధ్యాన్ని మెరుగుపరచడం, మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడమే తమ లక్ష్యమని ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం పేర్కొంది.
భారత్‌లో వాణిజ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందటంతో అందులో మెజారిటీ వాటా దక్కించుకోవడానికి పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే వాలెంటైన్స్ డే రోజున కేకులు, పువ్వులు డెలివరీ చేసింది. దాదాపు 20 ప్రాంతాల్లో అదే రోజు డెలివరీ సేవలను కూడా అందిస్తోంది. ఈ విభాగంలోని ప్రత్యర్థుల అభివృద్ధి ఆశాజనకంగా ఉండటంతో వారి వెనక్కి నెట్టేందుకు ఇ-కామర్స్ దిగ్గజం పావులు కదుపుతోంది.


Click it and Unblock the Notifications