హైదరాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ సరికొత్త సేవలు, మరో 5 నగరాల్లోను: 'స్థానిక' ఒప్పందాలు
ఈ-కామర్స్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన హైపర్ లోకల్ సర్వీస్ ఫ్లిప్‌కార్ట్ క్విక్ సేవలను ఆరు కొత్త నగరాలకు విస్తరించింది. ఇందులో హైదరాబాద్ సహా పలు నగరాలు ఉన్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, హైదరాబాద్, పుణే ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ క్విక్ సేవలను గత ఏడాది బెంగళూరు నగరంలో ప్రారంభించింది. ఇప్పుడు మరో ఆరు నగరాలకు విస్తరించింది. ఈ సేవల ద్వారా కేవలం 90 నిమిషాల్లోనే డెలివరీ అందుతుంది.

గంటన్నరలో డెలివరీ
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు బయట తిరిగేందుకు భయపడుతున్నారు. దీంతో సాధ్యమైనంత వరకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఈ-కామర్స్ సంస్థలపై ఆధారపడుతున్నారు. అందుకే కరోనా అనంతరం ఈ-కామర్స్ వ్యాపారం భారీగా పెరిగింది. ప్రధాన ఈ-కామర్స్ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి వ్యాపారం ఎగిసింది. కరోనా నేపథ్యంలో వేగవంతమైన డెలివరీ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్ క్విక్. నిత్యావసరాలు, పండ్లు, కూరగాయలు, మాంసం, గ్రాసరీ, మొబైల్, ఎలక్ట్రానిక్స్, బేబీ కేర్ ప్రోడక్ట్స్ వంటి వాటిని గంటన్నరలో (90 నిమిషాలు) డెలివరీ చేస్తుంది.

విడతలవారీగా ముంబై, కోల్‌కతాలకు
బెంగళూరు నుండి ఫ్లిప్‌కార్ట్ క్విక్ సేవలు ప్రారంభించి, తాజాగా ఐదు నగరాల్లో విస్తరించిన ఈ ఈ-కామర్స్ దిగ్గజం త్వరలో కోల్‌కతా, ముంబైలలోను విడతలవారీగా ప్రారంభించే ఆలోచనలో ఉంది. ఈ హైపర్ లోకల్ డెలివరీ సేవలు 2020లో బెంగళూరులో లాంచ్ చేసింది. తమ తమ లొకేషన్స్ నుండి ఫ్లిప్‌కార్ట్ హబ్స్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి వేగవంతమైన డెలివరీ అందుతుంది.

ఒప్పందాలు
సరసమైన, తాజా నిత్యావసర వస్తువులను కస్టమర్లకు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ క్విక్ స్థానిక వెండర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫ్లిప్‌కార్ట్ స్ట్రాటెజిక్ లాజిస్టిక్ పార్ట్‌నర్ షాడోఫాక్స్ డెలివరీకి సంబంధించి కీలక పాత్ర పోషిస్తోంది. త్వరితగతిన సేవలు అందించడంతో పాటు స్థానిక రుచికర ఆహారాన్ని ఆస్వాదించేందుకు కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉదాహరణకు బెంగళూరులో రత్నగిరి అల్ఫోన్సో మామిడి పళ్లను విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్లకు మొదటి ఆర్డర్ పైన లేదా తదుపరి ఆర్డర్ పరిమాణం రూ.499 పైన ఉచిత డెలివరీ ఉంటుంది.


Click it and Unblock the Notifications