సేల్ సీజన్ అంటే అందరికీ చాలా ఉత్సాహం వచ్చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఇ-కామర్స్ దిగ్గజాలు బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వంటి సేల్‌లను తీసుకు వస్తాయి. ఈ సమయంలో ఫోన్, ల్యాప్‌టాప్, హోమ్ అప్‌లయన్స్, ఫ్యాషన్, ఇతర ఉత్పత్తులు భారీ డిస్కౌంట్ ధరల్లో లభిస్తాయి. షాపర్లు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా కావలసిన వస్తువులు తక్కువ ధరలో కొని, ఆదా చేసుకోవచ్చు.
అలాగే, ఈ సేల్‌లలో కొన్ని డీల్స్ కేవలం ధర తగ్గింపుకు మాత్రమే కాదు, అద్భుతమైన ఫాస్ట్ డెలివరీ అనుభవం కూడా ఇస్తాయి. ఉదాహరణకి ఫ్లిప్‌కార్ట్ లో ఐఫోన్ 16 ఆర్డర్ పెట్టిన ఒక షాపర్, సాధారణంగా 2-3 రోజులు వచ్చే అని ఊహించిన ఆ ఫోన్ కేవలం 15 నిమిషాల్లో తన ఇంటి దగ్గరికి వచ్చింది అని లింక్డ్ఇన్ లో షేర్ చేశాడు. మనం ఇప్పుడు బ్లింకిట్, జెప్టో లాంటి కిరాణా డెలివరీ యాప్‌లలో 15 నిమిషాల్లో కిరాణా పొందతాము, కానీ ఐఫోన్ కూడా 15 నిమిషాల్లో వస్తుందనడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇలా, సేల్ మరియు స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా షాపర్లు సొమ్ము ఆదా చేయడం తో పాటు అద్భుతమైన సౌలభ్యం పొందుతారు.

అత్యంత హిట్ డీల్ ఐఫోన్ 16 సాధారణంగా రూ. 69,999 ధర, కానీ సేల్‌లో కేవలం రూ. 52,000 కి లభిస్తోంది. కానీ అసలు హల్‌చల్ కారణం షాపర్ అనుభవం. లింక్డ్ఇన్ లో అమన్ రుదోలా తన అనుభవం షేర్ చేశారు. అర్ధరాత్రి ఆర్డర్ పెట్టాడు, సాధారణంగా 2-3 రోజులు వేచిచూడాలి అనుకున్నాడు, కానీ "15 నిమిషాల్లో iPhone 16" డెలివరీ అయింది.
అతను చెప్పినట్టు, ఫ్లిప్‌కార్ట్ 15 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ చేసింది. ధర కేవలం రూ. 52,000, అది కూడా అర్ధరాత్రి. 15 నిమిషాల్లోనే ఫోన్ అతని ఇంటికి చేరింది. అతను షేర్ చేసినట్లు, ఇది మ్యాగీ తయారీ కంటే కూడా వేగంగా జరిగిందని చెప్పారు. డెలివరీ బాయ్ కూడా ఆసక్తికరంగా చెప్పాడు. స్టోర్ ఖాళీ అయిపోయింది సర్" 30 డెలివరీ బాయ్స్ ప్రతి ఒక్కరి జేబులో ఒక ఐఫోన్! అంటే, ఒక్క సమయంలో చాలా డెలివరీ బాయ్స్‌కి ఒక్కొక్కరు ఐఫోన్ తీసుకుని వెళ్తున్నారు. అర్ధరాత్రి, నగరంలో ఐఫోన్ అన్ని చోట్ల కదులుతున్నట్టే అనిపించింది. ఇది కేవలం డిస్కౌంట్ కారణంగా మాత్రమే కాదు, ఫ్లిప్‌కార్ట్ డిస్ట్రిబ్యూషన్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఫోన్లను వేగంగా, సమర్థవంతంగా అందించడం చూడటం అద్భుతంగా అనిపించింది.
సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చూసి వినియోగదారులు వివిధ రియాక్షన్స్ ఇచ్చారు. ఒకరు కామెంట్ ఇలా చేశారు "మ్యాగీ 15 నిమిషాల్లో కావాలంటే, ఐఫోన్ కంటే మంచి స్టవ్ ఆర్డర్ చేయండి. మ్యాగీ మాత్రం 5 నిమిషాల్లో సిద్ధం అవుతుంది, ఆ సమయంలో హెల్ప్ డిష్‌లు క్లీన్ చేస్తుంటారు...LOL" అని. ఇంకో యూజర్ 15 నిమిషాల్లో డెలివరీ సరికాదు. డెలివరీ పార్ట్‌నర్స్ రాత్రి పని చేస్తున్నారు, అది సురక్షితం కాదు. ఐఫోన్ బ్రెడ్ కాదు, మెడిసిన్ కాదు. ఇలాంటి వేగం ఇంపల్సివ్ బై అవుతుంది, పని చేస్తున్న వారిపై ఒత్తిడి పెడుతుంది. ఇంకొంతమంది మరొక ఆసక్తికరమైన ప్రశ్న"12 మిడ్నైట్‌లో మెడిసిన్స్ కూడా 15 నిమిషాల్లో డెలివరీ అవుతుందా?" అని అన్నారు.
ఇలాంటివి డెలివరీలు వస్తున్నట్లు ఉంటే, ముందుగా ఆ వెండర్లు ఆథరైజ్డ్‌గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేయడం కోసం ఐఫోన్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఆ ఫోన్ల వెండర్ లిస్ట్ చూడవచ్చు. సేల్ ఉందని వెంటనే ఆర్డర్ పెట్టకుండా, డిస్కౌంట్ నిజంగా మంచి డీల్ కి వస్తుందా, వెండర్ ఆథరైజ్డ్‌గా ఉన్నాడా అని ముందుగా చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఇలాంటివి ఎక్కువగా సేల్ టైమ్‌లో ఫ్రాడ్‌లు కూడా జరుగుతాయి.
ఈ కథ చెప్పేది ఏమిటంటే, ఇండియా ఇ-కామర్స్ లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నిజంగా next-level. కానీ, అదే సమయంలో, ఈ వేగం ఉద్యోగులపై ఒత్తిడి, సామాజిక సమస్యలు, మరియు అవసరం లేని ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. మనం ఇలాంటి "తక్షణ ఆనందం లోకి వెళ్తున్నాం, కానీ అందులో కొన్ని పాఠాలు కూడా ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications