IT News: బిలియనీర్ కొత్త AI స్టార్టప్.. TCS, Infosys, Wiproలకు షాక్.. గెట్ రెఢీ..!!
IT News: ప్రపంచ వ్యాప్తంగా ఏఐ సాంకేతికత తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అనేక ఐటీ సేవల కంపెనీలు సైతం దీనిని అందిపుచ్చుకునేందుకు తమ ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణను అందిస్తున్నాయి. ఫ్యూచర్ టెక్నాలజీ కావటంతో ఈ రంగంలో కొత్త స్టార్టప్ కంపెనీలు ప్రవేశిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ బిలియనీర్, ఫ్లిప్‌కార్ట్ సహ-వ్యవస్థాపకుడు బిన్ని బన్సాల్(Binny Bansal) ఏఐ ఆధారిత సేవలను అందించేందుకు సరికొత్త స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడైంది. బన్సాల్ తన కొత్త వెంచర్ కోసం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్తలతో కూడిన 15 మంది నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వేగంగా తన బృందాన్ని విస్తరించి టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ సర్వీసెస్ అవుట్‌సోర్సింగ్ కంపెనీలను అనుసరించాలని చూస్తున్నారు. దీంతో కార్పొరేట్ క్లయింట్‌లకు AI నైపుణ్యం, ఉత్పత్తులు, సేవలను అందించడంపై ప్రధానంగా దృష్టి సారించాడు.

ఈ స్టార్టప్ ప్రైమరీ ఆపరేటింగ్ హబ్ బెంగళూరులో ఉండగా ప్రధాన కార్యాలయం మాత్రం సింగపూర్ లో ఉంది. అలాగే దీని పరిధిని అమెరికాకు విస్తరించాలని చూస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్‌పే, క్యూర్‌ఫుడ్స్ వంటి స్టార్టప్‌లకు గణనీయమైన సహకారం అందించడంతో బన్సాల్ తన పెట్టుబడులను పెంచుకుంటూ పోయాడు. ఈ నెల ప్రారంభంలో తన మాజీ సహచరుడు అంకిత్ నగోరి నేతృత్వంలోని క్యూర్‌ఫుడ్స్‌లో 25-30 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాడు. Curefoods క్లౌడ్ కిచెన్‌లు, డైనింగ్ సంస్థలలో ప్రత్యేకతను కలిగి ఉంది.
దేశీయ ఈ-కామర్స్ వ్యాపార రంగంలో పెద్ద చరిత్రను లిఖించారు బన్సాల్. 2018లో ఆయన కంపెనీకి రాజీనామా చేశారు. దీనికి ముందు 2014లో మైంత్రాను కొనుగోలు చేసి ఆన్ లైన్ ఫ్యాషన్ వ్యాపారంలో వేగంగా అడుగులు వేశారు. కంపెనీ అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజాల నుంచి కఠినమైన పోటీని ఎదుర్కొంది. అలాగే దేశంలోని నియంత్రణ అడ్డంకులను ఎదుర్కొంది. 2018లో వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి వ్యాపార చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. తాజాగా తన నైపుణ్యాలను ఏఐ వ్యాపారంలో అడుగుపెట్టి విజయం సాధించేందుకు బన్సాల్ వినియోగిస్తున్నారు. అతని స్టార్టప్ స్కిల్స్ ఇతర ఐటీ కంపెనీలకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications