ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్‌ను సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభించనుంది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ వీకెండ్ సేల్ సందర్భంగా వినియోగదారులు మొబైల్స్, ట్యాబ్స్ సహా వివిధ వస్తువులపై మంచి ఆఫర్లు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ 18వ తేదీన ప్రారంభమై 20వ తేదీన ముగుస్తుంది. మూడు రోజుల పాటు ఈ సేల్ ఉంటుంది. ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పండుగ సమయంలో ఇలాంటి సేల్స్ ప్రకటిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ గురించి మరిన్ని విషయాలు....

రూ.1 చెల్లించి ముందుగానే బుక్ చేసుకోవచ్చు
కస్టమర్లు నచ్చిన వస్తువును ముందుగా కూడా బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఉండే ఈ సేల్ కోసం వస్తువును ముందుగానే కొనుగోలు చేయాలనుకునే వారు ఈ నెల 15, 16వ తేదీల్లో ముందుగానే (ప్రీ-బుక్) బుక్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఇలా ముందు బుక్ చేసుకోవడానికి కేవలం రూ.1 చెల్లిస్తే సరిపోతుంది. సేల్ సమయంలో ఆఫర్ పోను మిగిలిన మొత్తాన్ని చెల్లించి తీసుకోవచ్చు.

నో-కాస్ట్ ఈఎంఐ.. ఆఫర్లు, డిస్కౌంట్
కస్టమర్లు నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. క్రిడెట్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎసీలు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితర వస్తువులపై అప్లియెన్స్ ప్రొటక్షన్ కలిగి ఉంటారు. అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. అప్లియెన్సెస్, టెక్ ఉత్పత్తుల పైనే కాకుండా ఇతర యాక్సెసరీస్ పైన కూడా డిస్కౌంట్, ఆఫర్లు ఉన్నాయి. పవర్ బ్యాంకులు, ఛార్జెస్, హెడ్ ఫోన్లు, కేబుల్స్, మౌస్‌లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి.

ఎస్పీఐ కార్డుపై అదిరిపోయే ఆఫర్
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు సాధారణ, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఉంది. సమాచారం మేరకు మూడు కోట్ల ఎలక్ట్రానిక్, యాక్సెసరీస్ ఈ సేల్ సందర్భంగా అందుబాటులో ఉండనున్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ, డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ సహా ఇతర ఆఫర్లతో పాటు యాక్సెసరీస్ కోసం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ బై ప్రోడక్ట్స్ అనే మరో ఆఫర్ జోన్ కూడా ఉంది. ఇందులోనే వైర్ లెస్ మౌస్, కీబోర్డులు, పవర్ బ్యంకులు,కేబుల్స్, హెడ్ ఫోన్స్ వంటివి అందుబాటులో ఉంటాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications