Flipkart Big Saving Days: దేశంలోని షాపింగ్ ప్రియులకు శుభవార్త. ఫ్యాషన్ నుంచి గృహోపకరణాల వరకు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ సేవింగ్ డేస్ తిరిగి తీసుకొస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ సౌకర్యం ఒక రోజు ముందుగానే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.
షాపింగ్ ప్రియులకు మే 3 నుంచి మే 9 వరకు షాపింగ్ చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కొనసాగనున్నాయి. ఈ మెగా సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సహా అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో ఈకామర్స్ దిగ్గజం రెడీ అవుతోంది. ఈ ప్రత్యేక సేల్ సమయంలో కంపెనీ వివిధ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులపై తగ్గింపులను సైతం అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఈకామర్స్ దిగ్గజం వెల్లడించిన వివరాల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుల ద్వారా షాపింగ్ చేసే వ్యక్తులు ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తగ్గింపులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇదే సమయంలో యాక్సిస్ బ్యాంక్ ఫిప్‌కార్ట్ కార్డు హోల్డర్లు ఏకంగా 5 శాతం క్యాష్ బ్యాక్ అందుకోనున్నారు.
షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ పెంచేందుకు ఇప్పటికే కంపెనీ యూపీఐ చెల్లింపుల వ్యవస్థను యాప్ లోనే ప్రవేశపెట్టింది. ఇదే క్రమంలో పే లేటర్ సౌకర్యం కింద అర్హులైన కస్టమర్లకు రూ.లక్ష వరకు షాపింగ్ చేసుకునేందుకు వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. వీటి కింద నో కాస్ట్ ఈఎంఐలతో పాటు యూపీఐ లావాదేవీలపై గరిష్ఠంగా 50 శాతం డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది.
మార్కెట్లోకి టెలికాం కంపెనీలు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన వేళ దీనిని సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 సమయంలో మెుబైల్ ఫోన్లు ఎక్కువ మంది కొనుగోలు చేయాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మే 3 వరకు వేచి ఉండాల్సిందేనని తెలుస్తోంది. షాపింగ్ చేయాలనుకునేవారు డబ్బు రెడీ చేసుకోండి.


Click it and Unblock the Notifications