flipkart: ఘనంగా ముగిసిన ఫ్లిప్ కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్.. ఎంత మంది షాపింగ్ చేశారంటే..
flipkart: ఈ పండుగ సీజన్ లో ఏదో ఒక కొత్త ఉత్పత్తిని కొనాలని పలువురు భారతీయులు భావిస్తుంటారు. దీన్ని క్యాష్ గా మార్చుకునేందుకు సాధారణ వ్యాపారులతో పాటు ఆన్ లైన్ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థలు సైతం పోటీపడుతుంటాయి. ఇందులో భాగంగానే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ నిర్వహించి ఘనంగా ముగించింది.
దాదాపు 7 రోజులుగా ఆఫర్లతో పిచ్చెక్కించిన ఇ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ 'ది బిగ్ బిలియన్ డేస్'(TBBD) ఆదివారం ముగిసింది. ఈ 10వ ఎడిషన్ పండుగ అమ్మకాల్లో రికార్డు స్థాయిలో 1.4 బిలియన్ కస్టమర్స్ పాల్గొన్నట్లు వెల్లడించింది. మొదటి 4 రోజుల్లోనే కిరాణా భాగస్వాములు 4 మిలియన్లకు పైగా ప్యాకేజీలను అందించినట్లు చెప్పింది.

గతేడాదితో పోలిస్తే ప్లస్ మెంబర్ షిప్ లలో 60 శాతం పెరుగదల నమోదైనట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. పండగ రోజులకు ముందుతో పోలిస్తే తమతో లావాదేవీలు జరుపుతున్న విక్రేతలు 2.5 రెట్లు పెరిగినట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది తమ సప్లై చైన్ లో లక్ష కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించడం ద్వారా చాలా మందిలో పండుగ సంతోషాన్ని నింపినట్లు కంపెనీ CEO కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.
దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మరియు గృహోపకరణాలు ఈ ఏడాది బలమైన "ప్రీమియమైజేషన్" ధోరణిని సూచించాయి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ 2022 కంటే 1.7 రెట్లు పెరిగింది. సమర్థ్ ప్రోగ్రామ్ ద్వారా హౌసింగ్, ఫర్నిషింగ్, లైఫై స్టైల్ విభాగాల్లో 3.5 లక్షలకు పైగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. 30 కంటే ఎక్కువ బ్రాండ్స్ ఎంగేజ్ మెంట్ ఛాలెంజ్ లలో 2 మిలియన్లకు పైగా యూజర్స్ పాల్గొని షాపింగ్ రివార్డులను గెలుచుకున్నారు.


Click it and Unblock the Notifications