ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఈవెంట్‌కు ముందు భారతదేశంలో 70,000 మంది ఉద్యోగులను నియమించనున్నట్టు ఒక గుడ్ న్యూస్ చెప్పింది .వాల్మార్ట్ యొక్క ఫ్లిప్ కార్ట్ మంగళవారం 70,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని మరియు చాలా మందిని డెలివరీ భాగస్వాములుగానూ ,ఇతర సంస్థ కార్యాకలాపాల నిమిత్తం నియమించనున్నట్లు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.కామ్ యొక్క ఇండియన్ యూనిట్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్లో వాటా కోసం పోటీ పడుతున్నాయి.
ఆన్ లైన్ ఈ కామర్స్ దిగ్గజాలు కోవిడ్ -19 మహమ్మారి నుండి దెబ్బ తినకుండా మినహాయింపును పొందాయి . ఎక్కువ మంది భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్‌లను కిరాణా షాపింగ్ చేయడానికి ఉపయోగించారు.
ఫ్లిప్‌కార్ట్ యొక్క "బిగ్ బిలియన్ డేస్" సేల్స్ కంటే ముందే ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది . అమెజాన్ యొక్క ప్రైమ్ డే తరహాలో ఫ్లిప్ కార్ట్ లో కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇది సంవత్సరంలో భారీగా అమ్మకాలను సాగించే బిగ్ ఈవెంట్ . నాలుగు లేదా ఐదు రోజుల పాటు సాగే అమ్మకం సాధారణంగా అక్టోబర్ లో పండుగ సీజన్ లో ప్రారంభమై దీపావళితో ముగుస్తుంది.

ఇక ఇప్పటికే విస్తరించిన ప్రాంతాలలోనే కాకుండా ఫ్లిప్ కార్ట్ మారుమూల ప్రాంతాలకు తమ సర్వీసులను విస్తరించనుంది. డెలివరీ కోసం 50,000 కిరాణా షాపులతో కూడా ఒప్పందం చేసుకుంటామని కంపెనీ తెలిపింది.
డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, పికర్స్, ప్యాకర్స్ మరియు సార్టర్స్‌తో సహా ఫ్లిప్‌కార్ట్ యొక్క మార్కెటింగ్ చైన్ లో ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలతో పాటు , ఫ్లిప్‌కార్ట్ యొక్క పార్ట్ నర్స్ గా ఉండే విక్రయ షాపుల భాగస్వాముల దుకాణాలలో కూడా అదనపు పరోక్ష ఉద్యోగాలు కూడా లభిస్తాయని కంపెనీ ప్రకటనలో తెలిపింది . ఈ నెల ప్రారంభంలో, ఇ-కామర్స్ సంస్థ ఆన్‌లైన్ హోల్‌సేల్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కిరాణా సరుకుల వ్యాపారాన్నికూడా ప్రారంభించింది.


Click it and Unblock the Notifications