బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపానుగా (Cyclone Montha) బలపడి పలు రాష్ట్రాలను వణికిస్తోంది.ఈ తుఫాను దెబ్బకు ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి.నిన్న సాయంత్రానికి తుఫాన్ చెన్నైకి 420 కిలోమీటర్లు తూర్పు దిశగా, కాకినాడకు 450 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశగా, విశాఖపట్నానికి 500 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత ఆరు గంటలుగా Cyclone Montha గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదిలిందని తెలిపింది.
ప్రస్తుతం మొంథా తుఫాను మచిలీపట్నానికి 190 కి.మీ, కాకినాడకు 270కి.మీ, విశాఖపట్నానికి 340 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని తెలిపింది. ఈ రోజు రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది.

మొంథా తుఫాను నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన పలు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులను రద్దు అయ్యాయి. ఈ మేరకు గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ యం. లక్ష్మీకాంతరెడ్డి సోమవారం వెల్లడించారు. వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, షార్జా వెళ్లి వచ్చే 8 సర్వీసులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. తుపాను తీవ్ర రూపం దాల్చితే ఇండిగో విమానం సర్వీసులను సైతం నిలిపివేసే అవకాశం ఉందన్నారు. ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సర్వీసు మాత్రం యథావిధిగా నడుస్తుందని ఆయన తెలిపారు.ప్రయాణికులు తమ గమ్యస్థానాల నుండి బయలుదేరే ముందు ఎయిర్‌లైన్స్ వాళ్లతో సంప్రదించి.. ఆ తర్వాత విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు.
ఏపీపై మొంథా తుఫాను విరుచుకుపడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం నుంచి మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. మొత్తం 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అక్టోబర్ 27వ తేదీన ముందుగా రద్దు అని ప్రకటించిన రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ సోమవారం ప్రకటించింది. ఈ విషయాన్ని గమనించాలని ప్రయాణికులకు సూచించింది. తొలుత 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేయగా.. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అక్టోబర్ 27, 28, 29, 30వ తేదీల్లో ఈ రైళ్లను రద్దు చేసినట్లుగా రైల్వే శాఖ స్పష్టం చేసింది.
Cyclone Montha ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రైలు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. మంగళవారం, బుధవారం రోజుల్లో నడవాల్సిన పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. రాజమహేంద్రవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్, విశాఖపట్నం, ఒంగోలు, మాచర్ల వంటి స్టేషన్ల నుండి బయలుదేరే అనేక రైళ్లు రద్దు చేయబడ్డాయి. రద్దైన రైళ్ల వివరాలను ప్రయాణికుల మొబైల్ నంబర్లకు మెసేజ్‌ల రూపంలో పంపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి రిఫండ్ అందించనున్నట్లు వెల్లడించారు.
ప్రయాణానికి ముందే తమ రైలు స్థితి (status) తెలుసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. NTES మొబైల్ యాప్ లేదా https://enquiry.indianrail.gov.in వెబ్‌సైట్ ద్వారా రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలోనూ సమాచారం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
తుఫాను పరిస్థితుల నేపథ్యంలో వివిధ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
గూడూరు - 08624-250795
నెల్లూరు - 9063347961
ఒంగోలు - 7815909489
బాపట్ల - 7815909329
తెనాలి - 7815909463
విజయవాడ - 0866-2575167
ఏలూరు - 7569305268
రాజమండ్రి - 8331987657
సామర్లకోట - 7382383188
తుని - 7815909479
అనకాపల్లి - 7569305669
భీమవరం - 7815909402
గుడివాడ - 7815909462
రైళ్లకు సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా ప్రయాణికులు సమీప రైల్వే స్టేషన్ అధికారులను సంప్రదించవచ్చని రైల్వే శాఖ సూచించింది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications