Thefts in flight: విమాన ప్రయాణం అంటే గతంలో ఎంతో గొప్పగా భావించేవారు. అందులోని ప్రయాణీకులు కూడా ఎంతో హుందాగా ప్రవర్తించేవారు. కానీ మారుతున్న కాలానికి, జీవన ప్రమాణాలకు అనుగుణంగా అవి కూడా గాడి తప్పాయి. మద్యం సేవించి రచ్చ చేయడం, ఇతర ప్రయాణీకుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి వీటన్నిటినీ దాటుకుని మరో అడుగు ముందుకు వేశాడు.
కేవలం 6 నెలల వ్యవధిలోనే దాదాపు 1.5 నుంచి 2 కోట్లు వెనకేసుకున్నాడో దొంగ. ఢిల్లీలోని పహర్‌గంజ్‌కు చెందిన రాజేష్ కపూర్ అనే వ్యక్తి విమానం గాలిలో ఉండగానే దోపిడీలకు పాల్పడటం అలవాటు చేసుకున్నాడు. మొత్తం 10 మందికి చెందిన క్యాబిన్ బ్యాగేజ్‌ను లూటీ చేశాడు. దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు.

మహిళల క్యాబిన్ బ్యాగేజీలోని బంగారం, వజ్రాలు మరియు నగదును రాజేష్ తస్కరించేవాడని పోలీసులు తెలిపారు. అతడిపై RGIA, గచ్చిబౌలి, నార్సింగి, వనస్థలిపురంలో కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సదరు వ్యక్తి నుంచి సుమారు 2 కిలోల బంగారం, వజ్రాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న 40 నుంచి 55 ఏళ్ల వయసున్న మహిళలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో అతడిపై మొదటి కేసును గచ్చిబౌలిలో నమోదవ్వగా.. మొదటి తమను ఎవరూ నమ్మలేదని బాధితులు చెప్పారు. విమానంలో ఈ తరహా దోపిడీలు జరుగుతాయని ఎప్పుడూ ఊహించలేదన్నారు. అయితే రాజేష్ కేవలం 110 రోజుల్లో 200 సార్లు విమాన ప్రయాణం చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. బాధితులు మారుతూ ఉంటారే కానీ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం మారలేదని విచారణాధికారి వివరించారు.


Click it and Unblock the Notifications