Viral Posts: స్వతంత్రంగా బతకడం పేరిట ఈ మద్య యువత చిన్న వయసులోనే తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్తున్నారు. అలాంటి వారికి ఓ సోషల్ మీడియా యూజర్ గట్టి షాక్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సున్నితంగా హెచ్చరించింది. అయితే ఆమె ఈ రకమైన క్లాస్ పీకడానికి కారణం భారీ ఇంటి అద్దెలు కావడం విశేషం.
ముంబైకి చెందిన వీటా అనే ఓ న్యాయవాది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఓ పోస్ట్ చేశారు. నగరంలోని రియల్ ఎస్టేట్ రేట్ల గురించి అందులో ఆవేదన వ్యక్తం చేశారు. పీక్ లొకేషన్‌లలో ఫ్లాట్ అద్దెలు మోయలేని భారమని తెలిపారు. అంధేరి, బాంద్రా వంటి రద్దీ ఏరియాలు.. ఆఫీసులు ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లో నెలకు 50 నుంచి 70 వేల వరకు అద్దెలు వసూలు చేస్తున్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు.

దీంతో సామాన్యుడి సంపాదన అద్దెలు చెల్లించేందుకు సరిపోదని వీటా అభిప్రాయపడ్డారు. కుటుంబ లక్ష్యాలపై పునరాలోచించి వాటికి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. కుటుంబాలతో కలిసి ఉండటానికి ఇష్టపడటం అలవాటు చేసుకుని మరో ప్లాట్ అద్దె ఖర్చును ఆదా చేసుకోమని పొదుపు పాఠాలు చెప్పారు. స్వతంత్ర జీవితాన్ని ఆస్వాదించడానికి వేరే ఫ్లాట్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదని సూచించారు.
'మీ అమ్మ, నాన్నలతో మంచి సంబంధాలు కలిగి ఉండండి. 50 నుంచి 70 వేలు అద్దెలకు వెచ్చించే స్థాయి జీతం అందరికీ కుదరదు. కాబట్టి అలాంటి ఖరీదైన ఫ్లాట్స్ కోసం కష్టార్జితాన్ని వృథా చేసుకోవద్దు' అని ఆమె పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. లక్షకు పైగా వ్యూస్‌లో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ స్థాయి భారీ అద్దెలను విని జనం షాక్ అవుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications