ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit - FD) అనేది ఎలాంటి రిస్క్ లేదా మార్కెట్ రిస్క్ లేకుండా సురక్షితమైన వడ్డీ రేటుతో ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి మార్గం. దీనిని చాలా సులభమైన, సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు ఇతర ఆర్థిక సంస్థలు కూడా FD స్కీమ్స్ అందిస్తాయి. వీటిలో వివిధ కాలపరిమితులు, వడ్డీ రేట్లతో ఎన్నో FD పథకాలు ఉన్నాయి. మీరు FDలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

1. FD పై వడ్డీ రేటు:మీరు FDలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎంత లాభం పొందుతారు లేదా ఎంత రాబడి వస్తుందో తెలుసుకోవడానికి, ముందుగా మీరు ఎక్కడ, ఏ వడ్డీ రేటుతో FD పథకంలో పెట్టుబడి పెడుతున్నారో తెలుసుకోవాలి. FD పథకాలు సాధారణంగా 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు వివిధ వడ్డీ రేట్లతో ఉంటాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా FD పథకాన్ని తీసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ తెరిచి పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, వడ్డీ రేటును జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే మీరు FDలో ఏ కాలానికి పెట్టుబడి పెట్టినా మెచ్యూరిటీ వరకు మీకు ఫిక్స్డ్ వడ్డీ రేటు ప్రయోజనం లభిస్తుంది.
2. ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి: FDలో పెట్టుబడి పెట్టే ముందు, మీరు అకౌంట్ తెరుస్తున్న బ్యాంకులో FD పథకానికి కాలపరిమితి ఎంత ఉందో చెక్ చేయండి. ఇతర బ్యాంకుల్లో ఎంత కాలానికి ఎంత వడ్డీ రేటు ఇస్తున్నారో కూడా చూసుకోవడం మంచిది. సాధారణంగా, FD కాలపరిమితి 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంకా మరో 5 సంవత్సరాల వరకు పొడిగించే సౌకర్యం కూడా ఉంటుంది. నిపుణుల సలహా ప్రకారం, 13 నెలలు లేదా 5 సంవత్సరాల కాలపరిమితి గల FD పథకాలు ఉత్తమంగా పరిగణిస్తారు.
3. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల కలిగే ప్రయోజనాలు: FDలో పెట్టుబడి పెట్టే ముందు దానితో లభించే సౌకర్యాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. అధిక వడ్డీ రేట్లతో పాటు, పెట్టుబడిదారులకు సాధారణంగా లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అంటే, మీరు మీ FDపై లోన్ పొందవచ్చు. FD పెట్టుబడి మొత్తంలో 75 శాతం వరకు లోన్ వస్తుంది. నిబంధనల ప్రకారం, FD కాల వ్యవధి వరకు మాత్రమే ఈ లోన్ సౌకర్యం ఉంటుంది. ఉదాహరణకు, మీరు 10 సంవత్సరాల FD తీసుకొని రెండవ సంవత్సరంలో లోన్ కోసం అప్లయ్ చేసుకుంటే, మీరు మిగిలిన 8 సంవత్సరాల కాలానికి లోన్ పొందవచ్చు.
4. నమ్మకమైన బ్యాంకు ముఖ్యం: బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు రెండూ ఉన్నాయి. వీటితో పాటు ఆర్థిక సంస్థలు కూడా FD పథకాలను అందిస్తాయి. మీరు FD చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, FD అందించే బ్యాంక్ లేదా కంపెనీ రిజిస్టర్ చేయబడిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. DICGC (Deposit Insurance and Credit Guarantee Corporation) కింద రిజిస్టర్ చేయబడిన బ్యాంకులో మీరు రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేసి ఉంటే, ఒకవేళ బ్యాంక్ దివాలా తీసినా ఆ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇంకా DICGC కింద రిజిస్టర్ చేయబడిన బ్యాంకులలో FD పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications